Site icon HashtagU Telugu

Voter ID Transfer: ఇంట్లో నుంచి ఈజీగా మీ ఓటర్ కార్డు అడ్రస్ మార్చుకోవాలంటే ఇలా చేయాల్సిందే?

Mixcollage 07 Mar 2024 07 33 Am 6072

Mixcollage 07 Mar 2024 07 33 Am 6072

ప్రస్తుతం దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల హడావిడి మొదలైంది. ఆంధ్రప్రదేశ్‌లో అయితే లోక్‌సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి చాలా మంది ఓటు గుర్తింపు కార్డులతో సిద్ధం అవుతున్నారు. ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా కొత్త ఓటు హక్కును వినియోగించుకోవడానికి చాలామంది ఉన్నారు. అయితే కొంతమంది కొత్త నివాస ప్రాంతాలకు వెళ్లినా ఇప్పటివరకూ ఓటు గుర్తింపు కార్డులో అడ్రస్‌ను అప్‌డేట్ చేసుకోలేదు. సింపుల్‌గా వెళ్లిన చోట కొత్త ఓటు అప్లయ్ చేస్తున్నారు. అయితే ఆ అప్లికేషన్ రిజెక్ట్ అవుతూ ఉంటుంది. ఓటు గుర్తింపు కార్డుతో ఆధార్ జత కావడంతో ఇబ్బంది ఎదురవుతుంది.

కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా కేవలం ఇంట్లో నుంచే మన ఓటర్ ఐడీను కొత్త అడ్రస్‌తో అప్‌డేట్ చేయవచ్చు. గతంలో నియోజకవర్గ పరిధిలోన అడ్రస్ అప్‌డేట్‌కు అనుమతించిన కేంద్ర ఎన్నికల సంఘం ప్రస్తుతం దేశంలోని ఏ ప్రాంతానికైనా ఓటు కార్డును బదిలీ చేసుకునే అవకాశం కల్పించింది. మరి ఇంట్లో నుంచి ఈజీగా మీ ఓటర్ కార్డ్ అడ్రస్ ను ఎలా చేంజ్ చేసుకోవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అడ్రస్ చేంజ్ చేసుకోవడానికి కావలసినవి…మీరు ఉద్యోగ, వ్యాపార రీత్యా కొత్త ప్రాంతానికి మారితే మీ పేరు కూడా మీ మునుపటి అసెంబ్లీ నియోజకవర్గం ఓటర్ల జాబితా నుంచి మీ కొత్త అసెంబ్లీ నియోజకవర్గానికి బదిలీ చేసుకోవాలి.

ముఖ్యంగా అర్హులైన ఓటరు తమ పేరు ఉన్న ఓటర్ల జాబితా ఉన్న నియోజకవర్గంలో మాత్రమే ఓటు వేయగలరు. డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్, రేషన్ కార్డ్ మొదలైన చిరునామాకు సంబంధించి చెల్లుబాటు అయ్యే రుజువులు. ఆధార్, పాన్ కార్డ్ మొదలైన చెల్లుబాటయ్యే గుర్తింపు రుజువు. రెండు తాజా పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్‌లు..ఇప్పటికే ఉన్న ఓటర్ ఐడీ కార్డ్ కాపీ. మరి ఆన్ లైన్ లో అడ్రస్ ఎలా చేంజ్ చేసుకోవాలి అన్న విషయానికి వస్తే.. మొదట సంబంధిత వివరాలను నమోదు చేయాలి. అలాగే అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాలి. గుర్తింపు రుజువు, చిరునామా రుజువు, పాస్‌పోర్ట్-పరిమాణ ఫోటోగ్రాఫ్‌లు, ఇప్పటికే ఉన్న ఓటర్ ఐడీ కాపీలను అప్‌లోడ్ చేయాలి. చివరగా మీరు అందించిన సమాచారాన్ని ధ్రువీకరించి, మీ అభ్యర్థనను సమర్పించాలి. మరి ఆఫ్‌లైన్‌లో చిరునామా ఎలా మార్పు చేసుకోవాలి అన్న విషయానికి వస్తే.. ఆఫ్‌లైన్ మోడ్ ద్వారా మీ ఓటరు ఐడీ కార్డ్‌లోని శాశ్వత చిరునామాను మార్చడానికి ఓటర్ సేవా పోర్టల్ నుంచి ఫారం 8 ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. అవసరమైన వివరాలను పూరించి, సంబంధింత పత్రాలతో ఫారమ్‌ను సంబంధిత అధికారులకు సమర్పించాలి.