Chandrayaan-2: చంద్రుడిపై భారీగా సోడియం.. చంద్రయాన్-2 చెప్పిన ఆసక్తికర విషయాలు ఇవే!

తాజాగా చంద్రుడికి సంబంధించిన ఒక ఆసక్తికర విషయాన్ని చంద్రయాన్-2 వెల్లడించింది. అదేమిటంటే మన చంద్రుడి

  • Written By:
  • Publish Date - October 9, 2022 / 09:07 AM IST

తాజాగా చంద్రుడికి సంబంధించిన ఒక ఆసక్తికర విషయాన్ని చంద్రయాన్-2 వెల్లడించింది. అదేమిటంటే మన చంద్రుడి పై భారీగా సోడియం ఉన్నట్లుగా చంద్రయాన్-2 గుర్తించింది. చంద్రయాన్-2 లో ఉన్న క్లాస్ ద్వారా ఈ సోడియం నిల్వల మ్యాపింగ్ చేసినట్లుగా భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ అయిన ఇస్రో తాజాగా వెల్లడించింది. కాగా గతంలో చంద్రయాన్-1 లోని ఫ్లూరోసెన్స్ స్పెక్టోమీటర్ తొలిసారిగా చంద్రుడిపై సూర్యం ఉన్నట్లు గుర్తించిన విషయం తెలిసిందే.

అయితే ఇప్పుడు చంద్రయాన్-2 ఈ సోడియం మ్యాపింగ్ చేసినట్లుగా ఇస్రో సంస్థ తాజాగా ప్రకటించింది. కాగా హై సెన్సిటివిటీ సామర్థ్యం కలిగిన క్లాసును యు ఆర్ రావు సాటిలైట్ సెంటర్ లో తయారు చేసినట్లుగా అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తెలిపింది. అది సోడియం లైన్స్ ను వెంటనే గుర్తిస్తుంది అని పరిశోధకులు తెలిపారు. లూనార్ గ్రైన్స్ తో కలిసి ఉన్న ఈ సోడియం కళాలను ఈ క్లాస్ గుర్తించినట్లుగా వారు వెల్లడించారు. అయితే ఇలా చంద్రుడిపై ఉన్న వాతావరణం లో సోడియం లభించడం అన్నది నిజంగా ఆశ్చర్యకరమని వారు తెలిపారు. ఈ మేరకు ది ఆస్ట్రో ఫిజికల్ జనరల్ లెటర్స్ లో ప్రజరీతమైన కథనంలో ఈ విషయాన్ని ఇస్రో వెల్లడించింది. చంద్రుడి ఉపరితలం నుంచి కొన్ని వేల కిలోమీటర్ల వరకు ఈ సోడియం జాడలు కనిపించినట్లుగా ఇస్రో సంస్థ తెలిపింది. ఇందుకు సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.