WhatsApp for Windows: ఒకేసారి 4 డివైజ్‌లలో వాట్సాప్ వాడుకునే ఛాన్స్.. Windows కోసం సరికొత్త WhatsApp

వాట్సాప్ మరో సరికొత్త ఫీచర్ తీసుకువచ్చింది. దీంతో ఇకపై మీ వాట్సాప్‌ను ఒకేసారి నాలుగు డివైజ్‌లలో లాగిన్ అవ్వొచ్చు. దీనిపై వాట్సాప్ అధికారికంగా ట్వీట్..

వాట్సాప్ (WhatsApp) మరో సరికొత్త ఫీచర్ తీసుకువచ్చింది. దీంతో ఇకపై మీ వాట్సాప్‌ను ఒకేసారి నాలుగు డివైజ్‌లలో లాగిన్ అవ్వొచ్చు. దీనిపై వాట్సాప్ అధికారికంగా ట్వీట్ చేసింది. ఇకపై చార్జర్ అవసరం లేదు, ఎలాంటి సమస్య లేదు, ఒకవేళ మీ ఫోన్ ఆఫ్‌లైన్‌లోకి వెళ్లినప్పటికీ, మిగిలిన డివైజ్‌ల్లో వాట్సాప్ వాడుకోవచ్చు అంటూ ట్వీట్ చేసింది. ఒకేసారి నాలుగు డివైజ్‌ ల్లో లాగిన్ అయ్యి ఉండేందుకు వాట్సాప్ సరికొత్త విండోస్‌ యాప్‌ను తీసుకు వచ్చినట్లు ప్రకటించింది.

Windows కోసం సరికొత్త WhatsApp యాప్:

Windows కోసం ఒక సరికొత్త WhatsApp యాప్ ను వాట్సాప్ కంపెనీ పరిచయం చేసింది. ఇది Windowsలో వేగంగా లోడ్ అవుతుంది. iOS లేదా Android WhatsApp మొబైల్ యాప్‌కు సమానమైన ఇంటర్‌ఫేస్‌ను ఇది కలిగి ఉంది. ఈ డెస్క్ టాప్ కొత్త వర్షన్ WhatsApp ద్వారా వినియోగదారులు 8 మంది వ్యక్తులతో గ్రూప్ వీడియో కాల్స్, గరిష్టంగా 32 మందితో ఆడియో కాల్స్ చేసే ఛాన్స్ ఉంటుంది.  రాబోయే రోజుల్లో MAC వినియోగదారుల కోసం కూడా కొత్త వర్షన్ ను తేవాలని వాట్సాప్ ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం WhatsApp యొక్క కొత్త Mac డెస్క్‌టాప్ వెర్షన్ బీటా టెస్టింగ్‌లో ఉంది. Android ట్యాబ్స్ కోసం కూడా సపోర్ట్ చేసేలా వాట్సాప్ ను అభివృద్ధి చేస్తోంది.

ఈవివరాలను ఇటీవలి బ్లాగ్ పోస్ట్‌లో వాట్సాప్ మాతృ సంస్థ meta వెల్లడించింది. వినియోగ దారులు తమ వాట్సాప్ యాప్‌ను అప్‌డేట్ చేయడం ద్వారా ఈ కొత్త ఫీచర్‌ను పొందొచ్చు. అప్‌డేట్ చేసిన తర్వాత మీకు చాట్ బాక్స్‌లో ఆండ్రాయిడ్ లేదా iOSలోని WHatsAppలో అందుబాటులో ఉన్న కాల్ ఐకాన్ మాదిరిగానే కాల్ ఆప్షన్ కనిపిస్తుంది. వినియోగదారులు తమ WhatsApp ఖాతాలను మొబైల్, టాబ్లెట్ , డెస్క్ టాప్ Windowsలో సులువుగా, పూర్తి స్థాయిలో వినియోగించేలా ఏర్పాట్లు చేయడంపై Meta ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం Android టాబ్లెట్‌లు, Mac డెస్క్‌టాప్‌ల కోసం కొత్త WhatsApp బీటా ఎక్స్ పీరియన్స్ ను టెస్ట్ చేస్తోంది.

వాయిస్‌ వాట్సాప్ స్టేటస్‌ ఫీచర్:

రెండు రోజుల క్రితం వాయిస్‌ రికార్డు చేసి వాట్సాప్ స్టేటస్‌గా పెట్టుకునే ఫీచర్‌ను తీసుకు వచ్చింది. స్టేటస్ ద్వారా 30 సెకండ్లు వాయిస్ రికార్డ్ చేసుకునే వీలు కల్పించింది వాట్సాప్. దీనికోసం ముందు స్టేటస్ ఓపెన్ చేయాలి. అందులో పెన్ సింబల్ కనిపిస్తుంది. ఇదివరకు అది క్లిక్ చేసి కంటెంట్ రాసుకోవడానికి మాత్రమే వీలుండేది. ఇప్పుడు పెన్ సింబల్ ఓపెన్ చేయగానే టైపింగ్ బార్ పక్కన వాయిస్ రికార్డ్ సింబల్ కనిపిస్తుంది. అది క్లిక్ చేసి వాయిస్ రికార్డ్ చేసి స్టేటస్ పెట్టుకోవచ్చు.

Also Read:  Control Cholesterol with Onions: ఉల్లిపాయలతో కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతుందా? షుగర్ రోగులకు మంచిదా?