Site icon HashtagU Telugu

Ban China Smart Phones : చైనాకు షాక్…బడ్జెట్ స్మార్ట్ ఫోన్లపై కేంద్రం ఉక్కుపాదం..!!

Mobile Phones

Mobile Phones

గతకొంతకాలంగా భారత్, చైనా మధ్య సంబంధాలు అంతంతమాత్రమే. గాల్వాన్ లోయాలో ఘర్షణలు, ప్రాణనష్టం వంటి అంశాల నేపథ్యంలో భారత్, చైనా పట్ల కఠినంగా వ్యవహరిస్తోంది. భారత్ లో వ్యాపార కార్యకలాపాలు కొనసాగించే డ్రాగన్ కంట్రీ సంస్థలు నిబంధనల పరిధి నుంచి తప్పించుకోకుండా కఠినంగా వ్యవహరిస్తోంది. అవసరమైతే నిషేధాలకు కూడా వెనకాడటం లేదు.

ఈక్రమంలోనే మరో నిషేధానికి కేంద్రం యోచినట్లు సమాచారం. రూ. 12 వేల కంటే తక్కువ ధరకు లభించే చైనా ఫోన్లున భారత్ లో నిషేధించాలని కేంద్రం భావిస్తోందట. ప్రపంచంలో మొబైల్ ఫోన్ల మార్కెట్లో భారత్ రెండో అతిపెద్ద విపణిగా ఉండటంతో ఇక్కడ, ఒప్పో, షామీ వంటి చైనా స్మార్ట్ ఫోన్ సంస్థల హవా నడుస్తోంది. కేంద్రం నిర్ణయంతో దిగువశ్రేణి స్మార్ట్ ఫోన్ సెగ్మెంట్ నుంచి చైనా సంస్థలు నిష్క్రమించాల్సిందే.

కాగా చైనా సంస్థలకు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న సెగ్మెంట్ కూడా ఇదే. మధ్య తరగతి, దిగువ తరగతి జనాభా ఎక్కువగా ఉన్న భారత్ లో రూ. 12వేల కంటే తక్కువ లభించే ఫోన్లు అత్యథికంగా అమ్ముడు అవుతుంటాయి. ఈ సెగ్మెంట్ల చైనా సంస్థలకు అడ్డుకట్ట వేయాలన్న భారత్…ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. చైనా సంస్థలు భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్లో అగ్రగాములుగా ఉన్నప్పటికీ..నష్టాలు వస్తున్నాయని చూపిస్తున్నట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి.