Cars: ఇక కార్లు కూడా ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టుకోవచ్చు.. అందుబాటులోకి ఫ్లాట్‌ఫామ్

  • Written By:
  • Publish Date - April 19, 2023 / 06:55 PM IST

Cars: కరోనా వల్ల బయట వెళ్లి షాకింగ్ చేసేవారు తక్కువయ్యారు. ఆన్ లైన్ ఈ కామర్స్ రంగం బాగా విస్తరించింది. ఎన్నో వెబ్‌సైట్లు కొత్తగా పుట్టుకొస్తున్నాయి. ఈ కామర్స్ వెబ్ సైట్‌కి వెళ్లి ఇంట్లోని మొబైల్ నుంచే మనకు కావాల్సింది ఆర్డర్ చేసుకోవచ్చు. దాని ఫీచర్లు, స్పెసిఫికేషన్లు పరిశీలించి ఆన్‌లైన్ ద్వారానే ఏ ప్రొడక్ట్ నైనా కొనుగోలు చేయవచ్చు. ఆన్ లైన్ లో ఆర్డర్ పెట్టిన రెండు, మూడు రోజులకు నేరుగా ఇంటికే ప్రొడక్ట్ వచ్చేస్తుంది.

అంతేకాకుండా షాపులలో కంటే ఆన్‌లైన్‌లో ఎక్కువ మోడళ్లలో వస్తువులు ఉంటాయి. దీంతో ఆన్‌లైన్‌లోనే ఎక్కువమంది కొనుగోలు చేస్తున్నారు. వెజిటెబుల్స్ దగ్గర నుంచి ఎలక్ట్రానిక్ పరికరాలు వరు అన్నీ ఆన్‌లైన్ లో ఆర్డర్ పెట్టవచ్చు. అయితే ఇక నుంచి ఆన్ లైన్‌లో కార్లు కూడా ఆర్డర్ పెట్టవచ్చు. టయోలా కిర్లోస్కర్ మోటాలర్ ఇటీవల బెంగూరు కస్టమర్ల కోసం వీల్స్ అనే వెబ్ అనే ఫ్లాట్‌ఫామ్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా ఇంటి నుంచే టాయోటా మోడల్ కార్లను ఆర్డర్ చేయవచ్చు.

ఆన్ లైన్ లోనే కారు మోడల్, వేరియంట్లు, కారు ఎక్స్‌టీరియల్ ను డిజిటల్ గా చూడవచ్చు. అలాగే ఈ ప్లాట్ ఫామ్ లో తమ వద్ద ఉన్న పాత కార్లను సైతం ఎక్సేంజ్ కింద విక్రయించవచ్చు. అలాగే ఫైనాన్స్ సౌకర్యం కూడా ఉంటుంది. బుకింగ్ అమౌంట్, డౌన్ పేమెంట్ కూడా ఆన్లైన్ ద్వారా చెల్లించవచ్చు. అలాగే కారు ఆర్డర్ చేసిన డెలివరీకి సంబంధించిన అప్డేట్ ను వాట్సప్, ఈ మెయిల్ ద్వారా చూడవచ్చు. ఇప్పటికే ఈ ఫ్లాట్‌ఫామ్ లో అనేక సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ విషయాన్ని కంపెనీ యాజమాన్యం తెలిపింది.