BMW Electric Car: కార్ ఆ? లేక ఊసరవెల్లినా.. క్షణాల్లోనే రంగులు మార్చేస్తోందిగా?

ఊసరవెల్లి గురించి మనందరికి తెలిసిందే. ఊసరవెల్లి తన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి అవసరాలను బట్టి రంగులు

Published By: HashtagU Telugu Desk
Bmw Electric Car

Bmw Electric Car

ఊసరవెల్లి గురించి మనందరికి తెలిసిందే. ఊసరవెల్లి తన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి అవసరాలను బట్టి రంగులు మారుస్తూ ఉంటుంది. చాలా సందర్భాలలో కూడా మనుషుల విషయంలో ఊసరవెల్లి పేరు వాడుతూ ఉంటారు. ఊసరవెల్లి కంటే ఘోరంగా రంగులు మారుస్తున్నాడు కదరా అంటూ అందరు సందర్భానుసారం బట్టి ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఊసరవెల్లి మాదిరి రంగులు మార్చే కారుని ఎక్కడైనా చూశారా? ఊసరవెల్లి మాదిరి కారు రంగులు మార్చడం ఏంటా అని ఆశ్చర్యపోతున్నారా!మీరు విన్నది నిజమే.. తాజాగా ప్రముఖ అంతర్జాతీయ ఆటోమొబైల్ దిగ్గజం బీఎండబ్ల్యూ ఇటువంటి కారుని ఆవిష్కరించింది. ప్రపంచంలోనే మొట్టమొదటి ఊసరవెల్లి మాదిరి రంగులు మార్చే కారు ఇదే.

ఎలక్ట్రిక్ వాహన వేరియంట్లో దీనిని విడుదల చేసింది. లాస్ వేగాస్ లోని కస్యూమర్ ఎలక్ట్రానిక్ షోలో దీనిని ప్రదర్శించింది. కాగా ఆ కారుకు సంబంధించిన మరిన్ని వివరాల విషయానికి వస్తే.. బీఎండబ్ల్యూ కంపెనీ ఐ విజన్ డీ పేరుతో కొత్త రకం ఎలక్ట్రిక్ కారును ఆ కంపెనీ ఆవిష్కరించింది. మంచి ఫ్యూచరిస్టిక్ డిజైన్ తో మిడ సైజ్ సెడాన్ రకం కారు ఇది. అయితే ప్రస్తుతం మనం చూస్తున్న అడ్వాన్స్ డ్ టెక్నాలజీతో కూడిన కార్లలో ఆటో డ్రైవ్, డిజిటల్ ఫంక్షనింగ్ వంటి ఆప్షన్స్ అందుబాటులో ఉంటాయి. అయితే ఈ బీఎండబ్ల్యూ చెందిన కారు అంతకు మించి అన్నట్లు ఉంటుంది. ఈ కారు పరిస్థితులు, మూడ్స్ ను బట్టి తన రంగులు మార్చుకోవడంతో పాటు, ఎదుటి వాహనాల పరిస్థితులను కూడా డ్రైవర్ కు వివరిస్తుంది.

అనగా లిటరల్ గా డ్రైవర్ తో ఈకారు మాట్లుడుతుంది. ఈ కారు ఐ3 సెడాన్ శ్రేణికి చెందిన నియో క్లాసీ ఆర్కిటెక్చర్ తో వస్తుంది. దీనిలోని దాదాపు 240 భాగాలు 32 రంగుల్లో తన రూపును మార్చుకోగలగుతుంది. చక్రాల దగ్గర నుంచి టాప్ రూఫ్ వరకూ వివిధ భాగాలు , రకరకాల రంగులను మార్చుకుంటుంది. దీని హెడ్ లైట్స్, గ్రిల్ వివిధ రకాల మూడ్స్ ను ఎక్స్ ప్రెస్ చేస్తాయి. అంతేకాక ఈ కారు జనాలతో మాట్లాడుతుంది కూడా. దీని కోసం కారు సైడ్ విండోస్ వద్ద డ్రైవర్ అనుసంధానంగా డిజిటల్ అవతార్ ఉంటుంది. ఈ కారుకు సంబంధించిన టెక్నికల్ స్పెసిఫికేషన్లు, ధర వచ్చే ఏడాది ప్రకటించే అవకాశం ఉందని ఆ కంపెనీ తెలిపింది. అలాగే 2025 నాటికి కారును పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నారు.

  Last Updated: 06 Jan 2023, 07:06 PM IST