Car Care Tips: మీ కారు టైర్లు ఎక్కువ కాలం రావాలంటే ఈ చిట్కాలను పాటించాల్సిందే?

మాములుగా కార్ల వినియోగదారులు ప్రతి ఒక్కరు కూడా కార్ల టైర్లు తొందరగా అరిగిపోతున్నాయి. ఎక్కువ కాలం రావడం లేదు అని బాధపడుతూ ఉంటారు. కా

  • Written By:
  • Publish Date - January 29, 2024 / 08:30 PM IST

మాములుగా కార్ల వినియోగదారులు ప్రతి ఒక్కరు కూడా కార్ల టైర్లు తొందరగా అరిగిపోతున్నాయి. ఎక్కువ కాలం రావడం లేదు అని బాధపడుతూ ఉంటారు. కార్ల టైర్లు ఎక్కువ కాలం రావడం లేదు అంటే అందుకు మనం చేసే చిన్న చిన్న తప్పులు కూడా కారణం కావచ్చు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో కార్లపై ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం. టైర్‌ లను ఎంత బాగా చూసుకుంటే టైర్ లైఫ్ అంత మెరుగ్గా ఉంటుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు టైర్ గాలి, ఒత్తిడిపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. అయితే కార్ల టైర్ల జీవితం కాలం ఎక్కువ రోజులు రావాలంటే ఎలాంటి చిట్కాలను పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

వాహనం కొన్న తర్వాత చాలా మంది దానిని మెరుగుపరచడానికి విడిగా టైర్లను అమర్చుకుంటారు. తరచుగా ఇటువంటి టైర్ వాహనాలు పరిమాణంలో చిన్నవి లేదా పెద్దవి. అటువంటి టైర్లను అమర్చడం వాహనం మైలేజ్, ఇంజిన్‌పై ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది. అలాగే చాలామంది టైళ్లను కొనుగోలు చేసేటప్పుడు నాసిరకం టైర్ లను ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉంటారు. అలాంటి వాటి వల్ల టైర్ల జీవిత కాలం ఎక్కువ రోజులు ఉండదు. అలాంటి టైర్లు త్వరగా అరిగిపోతూ ఉంటాయి. దీని వల్ల మీరు ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుంది. రోడ్డు సరిగ్గా లేకపోయినా కారు టైర్లు చెడిపోయే అవకాశం ఉంది. ఇలాంటి రోడ్డు వెంట వెళ్లడం వల్ల కారు చక్రాల అమరికలో సమస్య తలెత్తవచ్చు. దీని వల్ల దీని కారణంగా కారు టైర్లు త్వరగా అరిగిపోతాయి.

అలాగే కారు మైలేజీ తగ్గడం ప్రారంభమవుతుంది. ఈ సమస్యను నివారించడానికి ప్రతి 10,000 కిలోమీటర్ల కారు డ్రైవింగ్‌కు వీల్ అలైన్‌మెంట్ చేయడం అవసరం. రోడ్డుపై టైర్ పంక్చర్ అయినట్లయితే, దాన్ని రిపేర్ చేయడానికి బదులుగా టైర్ సీలెంట్ ఉపయోగించాలి. ఇలా చేయడం ద్వారా పంక్చర్ సమస్య పరిష్కారం అవుతుంది. గాలి ఒత్తిడి తగ్గదు. మీరు సుదీర్ఘ పర్యటనకు వెళుతున్నట్లయితే టైర్ సీలెంట్ ఎల్లప్పుడూ మంచి ఎంపిక. మీరు మీ టైర్లలో సాధారణ వాయువుకు బదులుగా నైట్రోజన్ వాయువుతో నింపినట్లయితే, టైర్ల జీవితకాలం పెరుగుతుంది. సాధారణ వాయువు కంటే నైట్రోజన్ వాయువు చాలా మెరుగ్గా ఉంటుంది. టైర్‌లో తేమ తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కారు స్పీడ్ గా డ్రైవ్ చేస్తూ పదే పదే సడన్ బ్రేకులు వేయడం లాంటివి చేయకూడదు.