Site icon HashtagU Telugu

India Semiconductor Mission: మరో మూడు సెమీకండక్టర్ యూనిట్ల ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం

India Semiconductor Mission

India Semiconductor Mission

India Semiconductor Mission: భారతదేశంలో సెమీకండక్టర్స్ మరియు డిస్ ప్లే మాన్యుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్స్ డెవలప్‌మెంట్ కింద మూడు సెమీకండక్టర్ యూనిట్ల స్థాపనకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.మూడు సెమీకండక్టర్ యూనిట్లు గుజరాత్‌లోని ధోలేరా, అస్సాంలోని మోరిగావ్ మరియు గుజరాత్‌లోని ఆనంద్‌లో స్థాపించబడతాయి.

కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ మూడు యూనిట్లు రాబోయే 100 రోజుల్లో నిర్మాణాన్ని ప్రారంభిస్తాయని చెప్పారు. ఈశాన్యం అస్సాంలో మొదటి సెమీకండక్టర్ యూనిట్‌ ప్రారంభమవుతుంది. అస్సాం యూనిట్‌లో పెట్టుబడి 27,000 కోట్లు. ఇక్కడ నుండి ఉత్పత్తి చేసిన చిప్‌లను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆటోమొబైల్ కంపెనీలు ఉపయోగిస్తాయని వైష్ణవ్ అన్నారు.

పవర్‌చిప్ సెమీకండక్టర్ మాన్యుఫ్యాక్చరింగ్ కార్ప్ (PSMC), తైవాన్ భాగస్వామ్యంతో సెమీకండక్టర్ ఫ్యాబ్‌ను ఏర్పాటు చేస్తుంది. గుజరాత్‌లోని ధొలేరాలో ఈ ఫ్యాబ్‌ను నిర్మించనున్నారు. ఈ ఫ్యాబ్‌లో పెట్టుబడి రూ. 91,000 కోట్లు. ఇది నెలకు 50,000 వేఫర్ స్టార్ట్స్ (WSPM) సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ యూనిట్ 28 nm టెక్నాలజీతో అధిక-పనితీరు గల కంప్యూటింగ్ చిప్‌లను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఎలక్ట్రిక్ వాహనాల (EV), టెలికాం, డిఫెన్స్, ఆటోమోటివ్, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, డిస్‌ప్లే, పవర్ ఎలక్ట్రానిక్స్ మొదలైన వాటి కోసం పవర్ మేనేజ్‌మెంట్ చిప్‌లను ఉత్పత్తి చేస్తుంది.

టాటా సెమీకండక్టర్ అసెంబ్లీ మరియు టెస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ (TSAT) అస్సాంలోని మోరిగావ్‌లో సెమీకండక్టర్ యూనిట్‌ను ఏర్పాటు చేస్తుంది. ఈ యూనిట్‌ పెట్టుబడి రూ. 27,000 కోట్లు. ఈ యూనిట్ ఆటోమోటివ్, ఎలక్ట్రిక్ వాహనాలు, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, టెలికాం, మొబైల్ ఫోన్లు మొదలైన విభాగాలను కవర్ చేస్తుంది. దీని సామర్థ్యం రోజుకు 48 మిలియన్లు.

Also Read: Neha Shetty : రాధిక వెనక వాళ్లిద్దరు ఉన్నారా..? నేహా శెట్టి పెద్ద ప్లాన్ తోనే దిగింది..!