Xiaomi Offer: బంపర్ ఆఫర్.. షావోమి ఫోన్‌ పై భారీ డిస్కౌంట్.!

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమి తాజాగా వినియోగదారుల కోసం ఒక బంపర్ ఆఫర్ ను ప్రకటించింది.

Published By: HashtagU Telugu Desk
Xiaomi Offer

Xiaomi Offer

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమి తాజాగా వినియోగదారుల కోసం ఒక బంపర్ ఆఫర్ ను ప్రకటించింది. అదేమిటంటే 12 ప్రో 5జీ స్మార్ట్ ఫోన్‌ పై బంపర్ ఆఫర్ లభిస్తోంది. ఈ 12 ప్రో 5జీ స్మార్ట్ ఫోన్‌ లో 50 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా ఉంటుంది. అలాగే 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్, స్నాప్‌ డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్, ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్ వంటి అదిరే ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. ఈ ఫోన్‌ 8 జీబీ ర్యామ్, 256 జీబీ మెమరీతో లభించనుంది. కాగా ఈ స్మార్ట్ ఫోన్ వేరియంట్ ధర రూ. 79,999గా ఉంది. కానీ ఈ స్మార్ట్ ఫోన్ ని బంపర్ ఆఫర్ మీద ప్రస్తుతం కేవలం రూ. 54,999 లకే కొనుగోలు చేయవచ్చు.

అంతేకాకుండా షావోమి సంస్థ మరొక బంపర్ ఆఫర్ ని కూడా ప్రకటించింది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుల ద్వారా ఈ స్మార్ట్‌ ఫోన్‌ ని కొనుగోలు చేస్తే అదనంగా రూ. 3 వేల వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో పాటుగా ఎంఐ ఎక్స్చేంజ్ డీల్ కూడా ఉంది. ఇందులో భాగంగా రూ. ఈ స్మార్ట్ ఫోన్ పై 16,500 వరకు తగ్గింపు వస్తుంది. అలాగే ఎక్స్చేంజ్ బోనస్ రూపంలో 5000 వరకు కూడా తగ్గింపును పొందవచ్చు. అంతేకాకుండా నో కాస్ట్ ఈఎంఐ బెనిఫిట్ కూడా అందుబాటులో ఉంది. అంటే ఈ ఫోన్‌పై బంపర్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి అని చెప్పవచ్చు. షావోమి ప్రకటించిన ఆఫర్లు అన్నీ కలుపుకుంటే దాదాపుగా రూ. 49,500 వరకు డిస్కౌంట్ లభిస్తుంది.

12 జీబీ ర్యామ్, 256 జీబీ మెమరీ వేరియంట్‌ను అయితే రూ. 58,999కు కొనుగోలు చేయవచ్చు. ఫోన్‌ పై కూడా దాదాపు అన్ని ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ర్యామ్ మాత్రమే పెరుగుతుంది. మిగతా ఫీచర్లు అన్నీ కూడా ఒకేలా ఉంటాయి. కాగా ఈ ఆఫర్లు అన్ని ఎంఐ వెబ్‌సైట్‌ లో అందుబాటులో ఉన్నాయి. కేవలం ఈ ప్రీమియం స్మార్ట్‌ ఫోన్‌ పై మాత్రమే కాకుండా ఇతర ఫోన్ లపై కూడా అదిరే డిస్కౌంట్ ఆఫర్ లు లభిస్తున్నాయి. ఎంఐ క్లియరెన్స్ సేల్ అందుబాటులో ఉంది. ఇందులో భాగంగా ఎంట్రీ లెవెల్ స్మార్ట్‌ఫోన్‌ను అయితే రూ. 4 వేలకే సొంతం చేసుకోవచ్చు.

  Last Updated: 03 Nov 2022, 05:41 PM IST