Tecno Pop 7 Pro: మార్కెట్ లోకి టెక్నో స్మార్ట్ ఫోన్.. ధర, ఫీచర్స్ ఇవే?

దేశవ్యాప్తంగా రోజు రోజుకి స్మార్ట్ ఫోన్ వినియోగదారుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. స్మార్ట్ ఫోన్ కొనుగోలుదారుల

  • Written By:
  • Publish Date - February 18, 2023 / 07:00 AM IST

దేశవ్యాప్తంగా రోజు రోజుకి స్మార్ట్ ఫోన్ వినియోగదారుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. స్మార్ట్ ఫోన్ కొనుగోలుదారుల సంఖ్య పెరిగిపోతుండడంతో ఆయా కంపెనీలు కూడా కొత్త కొత్త స్మార్ట్ ఫోన్ లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉన్నాయి. తరచూ కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లు మార్కెట్ లోకి విడుదల అవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోని తాజాగా మార్కెట్ లోకి టెక్నో పాప్ 7 ప్రో ఫోన్ ని విడుదల చేసింది. ఈ ఫోన్లకు చక్కటి ఆదరణ లభిస్తోంది. మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో స్మార్ట్‎ఫోన్ కొనుగోలు చేయాలి అనుకునే వారికి టెక్నో పాక్ సెవెన్ ప్రో ఒక చక్కటి అవకాశం అని చెప్పొచ్చు. తక్కువ దయచేసి స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలి అనుకున్నవారికి ఈ ఫోన్ ఒక చక్కటి అవకాశం మనం చెప్పవచ్చు.

తాజాగా టెక్నో కంపెనీ తాాజాగా పాప్ 7 ప్రో ను ప్రారంభించింది. మరి తాజాగా మార్కెట్లోకి విడుదల చేసిన స్మార్ట్ ఫోన్ ధర ఫీచర్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఈ టెక్నో పాప్ 7 ప్రో ఫోన్ మనకు రెండు వేరియంట్‌లలో లభించనుంది. అందులో ఒకటి 2జీబీ64జీబీ , 3జీబీ64జీబీ. కాగా 2 జీబీ 64జీబీ వేరియంట్ ధర రూ.6,799 కాగా 3 జీబీ 64జీబీ వేరియంట్ రూ.7,299 గా ఉంది. కాగా ఈ ఫోన్ మనకు రెండు కలర్ లలో లభించనుంది. స్మార్ట్‌ఫోన్ ఎండ్‌లెస్ బ్లాక్ , ఉయుని బ్లూ కలర్ వంటి కలర్ లలో లభింనుంది. అమెజాన్ ఇండియా వెబ్‌ సైట్‌లో ఫిబ్రవరి 22 నుండి ఈ స్మార్ట్‌ఫోన్ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంది. కాగా టెక్నో పాప్ 7 ప్రో స్పెసిఫికేషన్‌ల విషయానికి వస్తే… ఇందులో 6.65 అంగుళాల HD+ డిస్‌ప్లేతో వస్తుంది.

2.5D కర్వ్డ్ గ్లాస్ డిస్‌ప్లే 20:9 యాస్పెక్ట్ రేషియో , 480 నిట్స్ బ్రైట్‌నెస్‌ని అందిస్తుంది. స్మార్ట్‌ ఫోన్ 3జీబీ వరకు ర్యామ్ తో జత చేయబడిన ఆక్టా కోర్ MediaTek Helio A22 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. టెక్నో పాప్ 7 ప్రో ఫోన్ 64జీబీ ఇంటర్నల్ స్టోరేజీతో వస్తోంది. మైక్రో SD కార్డ్ ద్వారా దీని మెమరీ 256జీబీ వరకు విస్తరించవచ్చు. ఈ ఫోన్ 5000mAh బ్యాటరీ సామర్థ్యంను కలిగి ఉండనుంది. ఫోన్ 12మెగాపిక్సెల్ ప్రధాన సెన్సార్‌తో కెమెరాతో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. సెల్ఫీ ప్రియుల కోసం, స్మార్ట్‌ఫోన్ 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కూడా కలిగి ఉంది.