Site icon HashtagU Telugu

One Plus 12: వన్ ప్లస్ ఫోన్లపై బంపర్ ఆఫర్స్.. పూర్తి వివరాలు ఇవే!

One Plus 12

One Plus 12

ప్రస్తుతం ఈ కామర్స్ సైట్స్ లో ఫెస్టివల్ సీజన్ నడుస్తోంది. ఇందులో భాగంగానే ఫెస్టివల్ సేల్స్ జరుగుతున్నాయి. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌తో పాటు ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ హవా నడుస్తోంది. అయితే ఈ సేల్ లో భాగంగా అనేక ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. మరి ముఖ్యంగా వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ లపై అద్భుతమైన ఆఫర్లు ఉన్నాయి. మరి ఏఏ ఫోన్ పై ఇలాంటి ఆఫర్స్ ఉన్నాయి అన్న విషయానికి వస్తే.. వన్ ప్లస్ 12 ప్రస్తుతం విజయ్ సేల్స్‌లో రూ. 62,999 ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. కాగా దాని అసలు ప్రారంభ ధర రూ. 64,999 నుండి తగ్గింది.

అంటే వినియోగదారులకు రూ.2,000 తగ్గింపు లభిస్తోంది. దీనికి అదనంగా విజయ్ సేల్స్ ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై రూ. 7,000 తక్షణ తగ్గింపును కూడా ఇస్తుంది. దీంతో ఈ ఫోన్ ధర రూ.55,999 కు లభిస్తోంది. అలాగే అమెజాన్‌ లో వన్ ప్లస్ 12 దాని అసలు ధర రూ. 64,999 వద్ద ఉంది. అయితే రూ.2,000 కూపన్‌ తో ఈ ఫోన్ ధర రూ.62,999కి తగ్గుతుంది. దీని కోసం మీరు అమెజాన్‌ లో వన్ ప్లస్ 12 లిస్టింగ్‌ లో కనిపించే కూపన్ బాక్స్‌ ను టిక్ చేయాలి. తగ్గిన మొత్తం చెక్ అవుట్ పేజీలో కనిపిస్తుంది. అదనంగా ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్‌పై రూ. 5,750 తక్షణ తగ్గింపు కూడా ఉంది.

దీంతో ఈ ఫోన్ రూ. 57,249కు పొందవచ్చు. ఈ ధర నేపథ్యంలో విజయ్ సేల్స్ వన్ ప్లస్ 12 స్మార్ట్‌ఫోన్‌ పై మరింత మెరుగైన డీల్‌ ను అందిస్తోంది. ఈ ఆఫర్ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటుంది. అలాగే వన్ ప్లస్ ఫోన్‌పై మరిన్ని తగ్గింపులను పొందడానికి వినియోగదారులు ఎక్స్ఛేంజ్ డీల్‌ లను క్లెయిమ్ చేయడాన్ని కూడా పరిగణించవచ్చు. మరిన్ని వివరాల కోసం వెంటనే ఆన్లైన్ స్టోర్స్ ని సంప్రదించడం మంచిది. ఒక్క వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్లపై మాత్రమే కాకుండా ఇంకా చాలా రకాల స్మార్ట్ ఫోన్ల పై కూడా బంపర్ ఆఫర్లను ప్రకటించాయి..

Exit mobile version