Samsung Galaxy S24: సాంసంగ్ స్మార్ట్ ఫోన్ పై కళ్ళు చెదిరే ఆఫర్.. ఏకంగా రూ. అన్ని వేల తగ్గింపు!

సాంసంగ్ సంస్థ తన స్మార్ట్ ఫోన్ పై ఏకంగా 20,000 తగ్గింపుతో తక్కువ ధరకే అందిస్తోంది.

Published By: HashtagU Telugu Desk
Samsung Galaxy S24

Samsung Galaxy S24

భారతదేశంలో సాంసంగ్ స్మార్ట్ ఫోన్ లకు ఉన్న క్రేజ్ డిమాండ్ గురించి మనందరికీ తెలిసిందే. స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఎక్కువ శాతం మంది ఈ శాంసంగ్ ఫోన్ లను ఇష్టపడుతూ ఉంటారు. సాంసంగ్ సంస్థ కూడా అందుకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేయడంతో పాటు అద్భుతమైన బంపర్ ఆఫర్లను కూడా అందిస్తూ ఉంటుంది. అందులో భాగంగానే ఇప్పుడు ఒక స్మార్ట్ ఫోన్ పై విధంగా 20000 రూపాయల తగ్గింపు అందిస్తోంది. ఇంతకీ ఆ స్మార్ట్ ఫోన్ ఏది? ఆఫర్లు ఏంటి అన్న విషయానికి వస్తే.. సాంసంగ్ తన గెలాక్సీ ఎస్ 24 అల్ట్రా 5జీ ఫోన్‌ పై ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది.

ముఖ్యంగా ఈ ఫోన్‌పై రూ. 20,000 తగ్గింపును అందిస్తుంది. సాంసంగ్ గెలాక్సీ ఎస్ 24 అల్ట్రా 5జీ ఫోన్ పరిమిత కాల ఆఫర్‌ లో భాగంగా కేవలం రూ.1,09,999 కే అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ వాస్తవానికి రూ.1,29,999 ప్రారంభ ధరతో ప్రారంభించారు. అయితే రూ. 8,000 ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్‌ తో పాటు రూ. 12,000 అదనపు అప్‌గ్రేడ్ బోనస్‌ తో కలిపి రూ. 20,000 తగ్గింపు పొందవచ్చు. అలాగే వినియోగదారులు రూ. 12,000 బ్యాంక్ క్యాష్‌బ్యాక్‌ ను కూడా పొందవచ్చని సాంసంగ్ కంసంస్థ తెలిపింది. అదనంగా మెరుగైన సరసతను కోరుకునే వినియోగదారులు 24 నెలల పాటు నో కాస్ట్ ఈఎంఐ ప్రయోజనాన్ని పొందవచ్చట. ఈ డీల్ అన్ని ప్రముఖ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌ లలో అందుబాటులో ఉంది.

కాగా ఈ ఫోన్ టైటానియం గ్రే, టైటానియం వైలెట్, టైటానియం బ్లాక్, టైటానియం ఎల్లో వంటి కలర్స్ లో లభించనున్నాయి. సాంసంగ్ గెలాక్సీ ఎస్ 24 అల్ట్రా 5జీ 6.8 అంగుళాల క్యూహెచ్‌డీ ప్లస్ డైనమిక్ ఎమోఎల్ఈడీ 2ఎక్స్ డిస్‌ప్లే, సూపర్ స్మూత్ 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ ఫ్లూయిడ్ యానిమేషన్‌ ల వంటి ఫీచర్లతో ఆకట్టుకుంటుంది. గెలాక్సీ ఎస్ 24 అల్ట్రా ప్రత్యేక కెమెరా సిస్టమ్ ను కూడా ఆకట్టుకుంటుంది. 120 డిగ్రీ ఎఫ్ఓవీతో 12 ఎంపీ అల్ట్రా-వైడ్ కెమెరా, ఓఐఎస్‌తో 200 ఎంపీ వైడ్ కెమెరా, 5 ఎక్స్, 3 ఎక్స్ ఆప్టికల్ జూమ్ ఎంపికలతో టెలిఫోటో కెమెరాలు ఉన్నాయి. ముఖ్యంగా 12 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా ఉంది. ఈ ఫోన్ 12జీబీ + 1టీబీ, 12జీబీ + 512 జీబీ, 12 జీబీ + 256 జీబీ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంటుంది.

  Last Updated: 15 Sep 2024, 12:13 PM IST