Amazon Offer: వన్‌ప్లస్‌ స్మార్ట్ ఫోన్‌పై భారీగా తగ్గింపు.. ధర, ఫీచర్స్ ఇవే?

చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం వన్‌ప్లస్‌ సంస్థ ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే

  • Written By:
  • Publish Date - January 18, 2024 / 06:00 PM IST

చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం వన్‌ప్లస్‌ సంస్థ ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. మార్కెట్లో కూడా వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ లకు భారీగా డిమాండ్ క్రేజ్ ఉంది. దీంతో ఆ క్రేజ్ ని దృష్టిలో ఉంచుకొని వన్ ప్లస్ సంస్థ కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంది. దాంతోపాటుగా ఇప్పటికే మార్కెట్లోకి విడుదల చేసిన స్మార్ట్ ఫోన్లపై తగ్గింపు ధరలను ప్రకటిస్తూ వినియోగదారులను విపరీతంగా ఆకర్షిస్తుంది వన్ ప్లస్. ఇది ఇలా ఉంటే తాజాగా కూడా మరోసారి వినియోగదారుల కోసం వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ పై తగ్గింపు ధరలను ప్రకటించింది.

ప్రముఖ ఈ కామర్స్‌ సైట్‌ అయిన అమెజాన్‌లో వన్‌ప్లస్‌ నార్డ్‌ 3 ఫోన్‌పై ప్రత్యేక తగ్గింపులను అందిస్తున్నట్లు వివరించారు. శక్తివంతమైన మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి ఈ ఫోన్‌ సరైన ఎంపికగా ఉంటుంది. ఈ ఫోన్‌పై అమెజాన్‌ రూ.6 వేల తగ్గింపును ఇస్తున్నారు. మరి ఈ స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన ఆఫర్లు,ఫీచర్ల విషయానికొస్తే.. వన్‌ప్లస్‌ నార్డ్‌3 128 జీబీ వేరియంట్, ప్రారంభ ధర రూ. 33999. అయితే ప్రస్తుతం అమెజాన్‌లో రూ.29999 వద్ద అందుబాటులో ఉంది. ముఖ్యంగా అమెజాన్‌ గ్రేట్‌ రిపబ్లిక్‌ సేల్‌లో ఇది రూ. 4,000 ఫ్లాట్ తగ్గింపును పొందుతుంది.

అదనంగా వన్‌ప్లస్‌ కంపెనీ ఈ ఫోన్‌ కొనుగోలుపై రూ. 1000 కూపను అందిస్తోంది. అంతేకాకుండా ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ హెూల్డర్లు తక్షణ 10 శాతం క్యాష్ బ్యాక్ అనగా 1000 వరకు పొందవచ్చు, దీని ద్వారా వన్‌ప్లస్‌ నార్డ్‌ 3 128 జీబీ ఫోన్‌ను రూ. 29,999 నుంచి రూ. 27,999కు పొందవచ్చు. ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్స్ విషయానికొస్తే.. వన్‌ప్లస్‌ నార్డ్‌ 3 6.74 అంగుళాల ఎమోఎల్‌ఈడీ డిస్‌ప్లేతో తో 120 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. టెంపెస్ట్ గ్రే, మిస్టీ గ్రీన్ కలర్‌ ఆప్షన్లలో లభ్యమవుతున్న వన్‌ప్లస్‌ నార్డ్‌ 3 మిడియా టెక్‌ డైమెన్సిటీ ప్రాసెర్‌ ద్వారా పని చేస్తూ ఆండ్రాయిడ్‌ 13 ఓఎస్‌తో రన్‌ అవతుంది. ఈ ఫోన్‌ వెనుకవై మూడు కెమెరాలు ఉన్నాయి. ఇందులో 50 ఎంపీ ప్రధాన కెమెరా, 8 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 ఎంపీ మాక్రో సెన్సార్ ఉన్నాయి. వీడియో కాల్స్, సెల్ఫీల కోసం 16 ఎంపీ కెమెరా ఈ ఫోన్‌ ప్రత్యేకత. అంతేకాకుండా 80 వాట్స్‌ ఫాస్ట్‌చార్జింగ్‌ సపోర్ట్‌ చేసే 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీతో ఈ ఫోన్‌ అందరినీ ఆకర్షిస్తోంది.