Site icon HashtagU Telugu

Redmi Note 13: ఎంఐ స్మార్ట్ ఫోన్ పై బంపర్ ఆఫర్.. ఏకంగా అన్ని రూ.వేలు తగ్గింపు!

Best Budget Camera Phones

Best Budget Camera Phones

భారత్ లో ఎంఐ ఫోన్ లకు ఉన్న క్రేజ్, డిమాండ్ గురించి మనందరికి తెలిసిందే. మార్కెట్లో ఎన్నో రకాల ఎంఐ ఫోన్లు ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. ఎక్కువ శాతం బడ్జెట్ స్మార్ట్ ఫోన్లే మార్కెట్ లో ఉన్నాయి. అందుకే మధ్యతరగతి ప్రజలు ఎంఐ ఫోన్స్‌ను అధికంగా కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే మార్కెట్‌లో ఇతర కంపెనీలు కూడా క్రమేపి బడ్జెట్ ఫోన్స్ రిలీజ్ చేయడంతో స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లో ఎంఐ ఫోన్లు గట్టి పోటీను ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఎంఐ నోట్ 13 5 జీ ఫోన్‌పై బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ ఫోన్‌పై దాదాపుగా రూ.3500 తగ్గింపును ప్రకటించింది.

అయితే త్వరలోనే రెడ్‌మీ నోట్ 14 సిరీస్ రిలీజ్ అవుతుందనే వార్తల నేపథ్యంలో ఈ ఫోన్‌ పై ఆఫర్ ప్రకటించారని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బడ్జెట్ ధరలోనే మంచి ఫీచర్స్‌ తో స్మార్ట్ ఫోన్ కావాలంటే మాత్రం రెడ్‌ మీ నోట్ 13 5 జీ ఫోన్‌ ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో రెడ్‌మీ 13 5జీ స్మార్ట్ ఫోన్ ధర, ఫీచర్ల వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అయితే తాజాగా అందించిన బంపర్ ఆఫర్ తో ఈ రెడ్‌మీ నోట్ 13 ఫోన్‌ ను కేవలం రూ.16,999 కే కొనుగోలు చేయవచ్చు. అయితే ఈ ఫోన్ అసలు ధర రూ.18,999 గా ఉంది. అలాగే ఐసీఐసీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ లపై ఫ్లాట్ రూ. 1,500 తగ్గింపు అందుబాటులో ఉంది.

అందువ్లల ఈ ఫోన్‌ను కేవలం రూ.15,499కే సొంతం చేసుకోవచ్చు. అలాగే పాత ఫోన్ ఎక్స్చేంజ్‌పై మంచి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. రెడ్‌మీ నోట్ 13 స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్ విషయానికి వస్తే.. 6.67 అంగుళాల ఎమోఎల్ఈడీ డిస్‌ప్లేతో 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌ తో వస్తుంది. ఈ ఫోన్ మీడియా టెక్ డైమెన్సిటీ 6080 చిప్‌సెట్ ద్వారా ఆధారంగా పని చేస్తుంది. 12 జీబీ + 256జీబీ వేరియంట్‌ లో వచ్చే ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13లో పని చేస్తుంది. హైపర్ ఓఎస్ రెడ్ మీ నోట్ 13 యొక్క ప్రత్యేకత.

హైపర్ ఓఎస్ ద్వారా వినియోగదారులు వివిధ ఎంఐ ప్లాట్‌ఫారమ్‌లలో టాస్క్‌లను అప్రయత్నంగా కొనసాగించడానికి, ప్రత్యామ్నాయ పరికరాలలో కాల్‌లను స్వీకరించడానికి, స్మార్ట్‌ఫోన్ వెనుక కెమెరాను ల్యాప్‌టాప్ వెబ్‌క్యామ్‌ గా ఉపయోగించడానికి, మొబైల్ డేటాను షేర్ చేయడానికి ఉపయోగపడుతుంది. రెడ్‌మి నోట్ 13 స్మార్ట్‌ఫోన్ 100 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కెమెరా, 2 మెగా పిక్సెల్ మాక్రో సెన్సార్‌ తో సహా డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ ను కలిగి ఉంది. ముందు భాగంలో సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్ సెన్సార్ ఉంది. 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది.