iPhone 12 : ఐఫోన్ 12 పై బంపర్ ఆఫర్.. కేవలం రూ.30 వేలకే సొంతం చేసుకోండిలా?

ఐఫోన్ (iPhone)ని కొనుగోలు చేయాలని చాలామందికి ఆశ ఉన్నప్పటికీ వాటి ధరల కారణంగా వెనకడుగు వేస్తూ ఉంటారు.

  • Written By:
  • Publish Date - December 7, 2023 / 06:20 PM IST

Bumper Offer on iPhone 12 : మామూలుగా టెక్ మార్కెట్ లో యాపిల్ ప్రొడక్ట్స్ కి ఏ రేంజ్ లో క్రేజ్ డిమాండ్ ఉందో మనందరికీ తెలిసిందే. ఈ యాపిల్ ప్రొడక్ట్స్ ధర కాస్త ఎక్కువ అయినప్పటికీ ఇష్టపడి కొనుగోలు చేసేవారు చాలామంది ఉన్నారు. యాపిల్ నుంచి ఏదైనా కొత్తగా ఒక ప్రోడక్ట్ లాంచ్ అవుతుంది అంటే దానిపై ప్రతి ఒక్కరి దృష్టి పడుతూ ఉంటుంది. అయితే ఐఫోన్ (iPhone)ని కొనుగోలు చేయాలని చాలామందికి ఆశ ఉన్నప్పటికీ వాటి ధరల కారణంగా వెనకడుగు వేస్తూ ఉంటారు. అటువంటి వారి కోసం అప్పుడప్పుడు కొన్ని ఆన్లైన్ స్టోర్స్ భారీగా డిస్కౌంట్ ధరలను ప్రకటిస్తూ ఉంటాయి. అందులో భాగంగానే ఐఫోన్ (iPhone)ప్రియుల కోసం ఫ్లిప్కార్ట్ ఒక బంపర్ ఆఫర్లు తీసుకువచ్చింది.

We’re now on WhatsApp. Click to Join.

ఫ్లిప్‌కార్ట్‌ యాపిల్‌ ఐఫోన్‌ 12 పై భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. దీంతో ఫోన్‌ను తక్కువ ధరకే సొంతం చేసుకునే అవకాశం లభిస్తుంది. ఐఫోన్‌ 12 64 జీబీ వేరియంట్ అసలు ధర రూ. 49,900 కాగా 15 శాతం డిస్కౌంట్‌ తో భాగంగా రూ. 41,999 కే సొంతం చేసుకోవచ్చు. అలాగే యాక్సిస్‌ బ్యాంక్‌ కు చెంది క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేసే 10 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. దీంతో గరిష్టంగా రూ. 1000 డిస్కౌంట్ పొందవచ్చు. ఇక వీటితో పాటు ఫ్లిప్‌కార్ట్ ఎక్స్చేంజ్‌ ఆఫర్‌ను సైతం అందిస్తున్నారు. పాత ఫోన్‌ను ఎక్స్చేంజ్‌ చేయడం ద్వారా గరిష్టంగా రూ. 40,800వ వరకు డిస్కౌంట్‌ పొందవచ్చు. తక్కువలో తక్కువ మీ పాత ఫోన్‌కు పదివేలు వచ్చినా రూ. 30 వేలలో యాపిల్ 12ని సొంతం చేసుకోవచ్చు. ఒకవేళ పూర్తిగా ఎక్స్చేంజ్‌ వర్తిస్తే అత్యంత తక్కువ ధరకే ఫోన్‌ను కొనుగోలు చేసుకోవచ్చు.

ఇకపోతే ఈ ఆపిల్ ఐఫోన్ 12 ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 64 జీబీ స్టోరేజ్‌ను అందించారు. ఇక 6.1 ఇంచెస్‌తో కూడిన సూపర్‌ రెటీనా ఎక్స్‌డీఆర్‌ డిస్‌ప్లేను అందించారు. ఇక 12 మెగా పిక్సెల్‌, 12 మెగా పిక్సెల్స్‌తో కూడిన డ్యూయల్‌ కెమెరా సెటప్‌ ను కూడా అందించారు. అలాగే సెల్ఫీల కోసం 12 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. ఏ14 బయోనిక్‌ చిప్‌ ప్రాసెసర్‌తో పని చేస్తుంది. ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే ఈ ఫోన్‌ సొంతం. ఇక కెమెరా నైట్‌ మోడ్‌, 4కే డాల్బీ విజన్‌ హెచ్‌డీఆర్‌ రికార్డింగ్‌ను అందించారు.

Also Read:  Spirituality: స్త్రీలు మంగళసూత్రం విషయంలో ఎక్కువగా చేసే పొరపాట్లు ఇవే?