Site icon HashtagU Telugu

BSNL: బీఎస్ఎన్ఎల్ యూజర్స్ కి భారీ శుభవార్త.. రీచార్జ్ ప్లాన్స్ మామూలుగా లేవుగా?

BSNL

BSNL

ప్రముఖ టెలికాం కంపెనీ బీఎస్ఎన్ఎల్ సంస్థ యూజర్లను ఆకట్టుకోవడం కోసం కొత్త కొత్త రీఛార్జ్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో రకాల రీఛార్జి ప్లాన్స్ తీసుకువచ్చిన బీఎస్ఎన్ఎల్ సంస్థ ఇప్పుడు మరికొన్ని రీఛార్జ్ ప్లాన్లను తీసుకువచ్చింది. కాగా తాజాగా కంపెనీ తన యూజర్ల కోసం ప్రత్యేకంగా కొత్త కొన్ని రీఛార్జ్ ప్లాన్‌ ను ప్రవేశపెట్టింది. ఈ బీఎస్ఎన్ఎల్ రీఛార్జ్ ప్లాన్ ధర రూ. 750 చెల్లిస్తే చాలు ఏకంగా 6 నెలల వరకు వ్యాలిడిటీ అందిస్తుందట.

అయితే ఈ ప్లాన్ ఎంపిక చేసిన యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుందట. ప్రత్యేకంగా, బీఎస్ఎన్ఎల్ జీపీ 2 కేటగిరీ కస్టమర్లకు మాత్రమే ఇది వర్తిస్తుందట. 7 రోజులకు పైగా రీఛార్జ్ చేయని యూజర్లు మాత్రమే రాబోయే 165 రోజుల్లో ఈ ప్లాన్‌ ను వినియోగించుకోగలరని చెబుతున్నారు. ఈ రీఛార్జ్ ప్లాన్ రోజుకు 1జీబీ డేటాతో పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్‌ లను కూడా అందిస్తుంది. ఫెయిర్ యూసేజ్ పాలసీ డేటా లిమిట్ చేరుకున్న తర్వాత స్పీడ్ 40Kbps కి పడిపోతుందట. అయితే మొత్తం మీద ఈ ప్లాన్ మొత్తం 180జీబీ డేటాను అందిస్తుందట. ఈ ప్లాన్ 180 రోజుల వ్యాలిడిటీతో వస్తుందట. దేశంలో ఇతర ఏ ప్రైవేట్ టెలికాం ఆపరేటర్ కూడా ఇలాంటి ప్లాన్‌ లను అందించలేదట.

బీఎస్ఎన్ఎల్ మాత్రమే ఈ కొత్త ఆఫర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ బీఎస్ఎన్ఎల్ యూజర్లకు ఇతర నెట్‌వర్క్‌ లకు మారకుండా ఉండేందుకు అద్భుతమైన డీల్ అందించడమే లక్ష్యంగా పెట్టుకుందట. టెలికమ్యూనికేషన్ ల విభాగం ఇటీవల ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో గత 90 రోజుల్లో 71 వేలకు పైగా సిమ్ కార్డులను బ్లాక్ చేసిన విషయం తెలిసిందే. ఈ సిమ్ కార్డులు మోసపూరిత పద్ధతుల ద్వారా పొందినట్టు గుర్తించారు. అయితే ప్రధానంగా స్కామ్‌ ల కోసం ఈ సిమ్ కార్డులను ఉపయోగించినట్టు నివేదికలు సూచిస్తున్నాయి.