Site icon HashtagU Telugu

BSNL: మరింత స్పీడ్ పెంచిన బీఎస్ఎన్ఎల్.. 5జీ నెట్వర్క్ పై కీలక అప్డేట్?

Bsnl

Bsnl

ప్రముఖ టెలికాం కంపెనీ బీఎస్ఎన్ఎల్ గత కొద్ది రోజులుగా ముఖ్యాంశాలుగా నిలుస్తున్న విషయం తెలిసిందే. టెలికాం కంపెనీలు అయినా ఎయిర్టెల్ జియో వంటివి రీఛార్జ్ ధరలను భారీగా పెంచడంతో వినియోగదారులు ప్రతి ఒక్కరు కూడా బీఎస్ఎన్ఎల్ వైపు మొగ్గు చూపుతున్నారు. దానికి తోడు వినియోగదారులను మరింత ఆకర్షించడం కోసం తక్కువ ధరకే అద్భుతమైన ప్లాన్లను అందిస్తుంది బిఎస్ఎన్ఎల్ సంస్థ. ఇలా గత కొద్ది రోజులుగా ఎక్కడ చూసినా కూడా బీఎస్ఎన్ఎల్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. రీఛార్జ్ ప్లాన్లతో పాటుగా 4జి నెట్వర్క్ ను సరిదిద్దడం వరకు ఈ ప్రభుత్వ టెలికాం సంస్థ ఇప్పుడు నెమ్మదిగా ప్రైవేట్ కంపెనీలతో పోటీ పడటానికి సిద్ధమవుతోంది.

ఈ ఫోర్ జి ఫైవ్ జి నెట్వర్క్ లను విస్తరించడం కోసం బీఎస్ఎన్ఎల్ కంపెనీ కూడా గిట్టిగానే కృషి చేస్తోంది. ఇటీవల ఫోర్ జి నెట్వర్క్ మొదలు పెట్టిన విషయం తెలిసిందే. కానీ వినియోగదారుల దృష్టి మొత్తం ఫై జి నెట్వర్క్ పైనే ఉంది. ఇలాంటి సమయంలోనే బిఎస్ఎన్ఎల్ సంస్థ వినియోగదారులకు ఒక శుభవార్తను తెలిపింది. అదేమిటంటే కంపెనీ తన 5జీ నెట్‌వర్క్‌ ను అతి త్వరలో అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఇందు కోసం పనులు కూడా ముమ్మరం చేస్తోంది. ఎల్. శ్రీను, ఆంధ్రప్రదేశ్ ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్, భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ నివేదిక ప్రకారం… బీఎస్ఎన్ఎల్ 5జీ సేవను ప్రారంభించనున్నట్లు విలేకరుల సమావేశంలో ప్రకటించారు. జనవరి 2025 నెలలో తమ 5జీ సేవను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది.

అదే సమయంలో వీలైనంత త్వరగా 5జీ రోల్‌ అవుట్‌ ను సులభతరం చేయడానికి దాని మౌలిక సదుపాయాలను అప్‌గ్రేడ్ చేయడంపై కంపెనీ నొక్కి చెబుతోంది. ఇందులో టవర్లు, ఇతర అవసరమైన పరికరాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. 4జీ సేవను 5జీ కి మార్చడానికి బీఎస్ఎన్ఎల్ కసరత్తు చేస్తోంది . అంటే 5జీ సేవను ప్రారంభించేందుకు ఎక్కువ పెట్టుబడి అవసరం ఉండదు. బీఎస్ఎన్ఎల్ ఇప్పటికే తన 4జీ సేవలను ప్రారంభించిన ప్రాంతాల్లో 5జీ రోల్ అవుట్ ప్రారంభమవుతుంది. దీని తర్వాత అప్‌గ్రేడ్ ప్రక్రియ పూర్తవుతుంది. వీలైనంత త్వరగా 5జీ నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు కంపెనీ చెబుతోంది.