Site icon HashtagU Telugu

BSNL: ఇది కదా రీఛార్జ్ ప్లాన్ అంటే.. తక్కువ ధరకే 52 రోజుల వ్యాలిడిటి?

Bsnl

Bsnl

ప్రముఖ టెలికాం కంపెనీలు అయిన జియో ఎయిర్టెల్, వోడాఫోన్,ఐడియా వంటివి రీచార్జ్ ధరలను భారీగా పెంచడంతో వినియోగదారుల దృష్టి మొత్తం బీఎస్‌ఎన్‌ఎల్‌ వైపు మల్లింది. ఇప్పటికే చాలామంది బీఎస్‌ఎన్‌ఎల్‌ కీ పోర్ట్ అయిన విషయం తెలిసిందే. వినియోగదారులను మరింత ఆకర్షించడం కోసం బీఎస్‌ఎన్‌ఎల్‌ సంస్థ కూడా తక్కువ ధరకే అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్లను తీసుకువస్తుంది. అందులో భాగంగానే ఇప్పటికే చాలా రకాల రీఛార్జ్ ప్లాన్ లను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మరో అద్భుతమైన అదిరిపోయే రీఛార్జి ప్లాన్ తీసుకువచ్చింది.

మరి ఆ వివరాల్లోకి వెళితే.. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ 52 రోజుల చెల్లు బాటుతో అయ్యే రీఛార్జ్ ప్లాన్ అందిస్తోంది. బీఎస్‌ఎన్‌ఎల్‌ తన వినియోగదారులకు రూ.298 రీఛార్జ్ ప్లాన్‌తో కాలింగ్, డేటా ప్రయోజనాలను అందిస్తోంది. అపరిమిత కాలింగ్, అపరిమిత డేటాతో బీఎస్‌ఎన్‌ఎల్‌ ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 52 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ప్యాక్ లోకల్, ఎస్టీడీలో అపరిమిత వాయిస్ కాల్‌ లను అందిస్తోంది.

ఇందులో రోజుకు 1జీబీ డేటాతో పాటు రోజుకు 100 SMSల సౌకర్యం ఉంది. ఈ ప్లాన్‌లో Eros Now వినోద సేవలకు ఉచిత సభ్యత్వం కూడా ఉంది. అపరిమిత డేటా, ఎక్కువ కాలం కాల్ చేయాలనుకునే వారికి ఈ ప్లాన్ అనుకూలంగా ఉంటుంది. ఈ రీఛార్జ్ ప్లాన్ తో పాటు ఇప్పుడు మరిన్ని రీఛార్జి ప్లాన్లను తీసుకువచ్చే ప్రయత్నంలో ఉంది బిఎస్ఎన్ఎల్ సంస్థ.