ప్రముఖ టెలికాం కంపెనీలు ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఇండియా, రిలయన్స్ జియో, బీఎస్ఎన్ఎల్ ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. అయితే వీటిలో బీఎస్ఎన్ఎల్ ఇప్పుడు వినియోగదారులను ఎక్కువగా ఆకర్షిస్తోంది. జియో, ఎయిర్టెల్ వంటి కంపెనీలు రీఛార్జ్ ధరలను భారీగా పెంచడంతో వినియోగదారులు అందరు బీఎస్ఎన్ఎల్ వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే యూజర్స్ ని మరింత ఆకర్షించడం కోసం బిఎస్ఎన్ఎల్ సంస్థ తక్కువ ధరకే అద్భుతమైన రీచార్జ్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకు వస్తోంది. ఇప్పటికే చాలా రకాల రీఛార్జ్ ప్లాన్లను తీసుకువచ్చిన బీఎస్ఎన్ఎల్ సంస్థ ఇప్పుడు మరో కొత్త రీఛార్జ్ ప్లాన్ ని తీసుకువచ్చింది.
మరి ఆ వివరాల్లోకి వెళితే.. కేవలం 94 రూపాయల ప్లాన్‌ను అందిస్తోంది. బీఎస్‌ఎన్‌ఎల్ ఈ ప్లాన్ ఇతర టెలికాం కంపెనీల కంటే చాలా చౌకైనది. దీని ధర 30 రోజుల చెల్లుబాటుతో కేవలం రూ. 94 మాత్రమే. ఈ ప్లాన్ వినియోగదారులలో బాగా ప్రాచుర్యం పొందింది. ఇది ఇతర టెలికాం కంపెనీలకు కూడా ముప్పుగా మారవచ్చు. ఈ ప్లాన్ ధర రూ.94. దీనితో పాటు వినియోగదారులకు 30 రోజుల వాలిడిటీ ఇస్తోంది. అంతే కాకుండా వినియోగదారులకు కాలింగ్ సదుపాయం, 3జీబీ డేటాను కూడా అందిస్తున్నారు. ఈ డేటా ఎటువంటి పరిమితులతో రాదు. మీరు మీ సౌలభ్యం ప్రకారం ఎప్పుడైనా ఉపయోగించవచ్చు. తక్కువ డేటా వినియోగించే వారి కోసం ఈ ప్లాన్ బాగా ఉపయోగపడుతుందని చెప్పాలి.
మరోవైపు జియో 91 రూపాయలకు ఇదే విధమైన చౌక ప్లాన్‌ను అందిస్తోంది. ఇది 3జీబీ డేటా, అపరిమిత కాలింగ్‌ను కూడా అందిస్తుంది. అయితే ఈ ప్లాన్‌లో మీరు రోజుకు 100 ఎంబీ కంటే ఎక్కువ ఉపయోగించలేరు. వోడాఫోన్ ఐడియా ఈ ప్లాన్‌ను రూ. 107కు అందిస్తోంది. దీనిలో మీరు 200 నిమిషాల ఉచిత కాల్ సౌకర్యంతో పాటు 3 జీబీ డేటాను కూడా పొందుతారు. ఈ ప్లాన్ 35 రోజుల చెల్లుబాటుతో అందుబాటులో ఉంటుంది. ఎయిర్‌టెల్ 121లో 30 రోజుల సదుపాయంతో ప్లాన్‌ను అందిస్తోంది. దీనిలో మీరు ప్రీమియం వింక్ మ్యూజిక్‌తో పాటు 6 జీబీ డేటాను పొందుతారు. కానీ వీటన్నింటిని మించి బీఎస్ఎన్ఎల్ సంస్థ తక్కువ ధరకే ఎక్కువ రోజులు రీఛార్జ్ ప్లాన్ తీసుకురావడంతో పాటు 3జీబీ డేటాను కూడా అందిస్తోంది.