Site icon HashtagU Telugu

BSNL: న్యూ ఇయర్ సందర్భంగా మరో అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్ తీసుకువచ్చిన బీఎస్ఎన్ఎల్.. ఈ ఆఫర్ అప్పటి వరకు మాత్రమే!

Bsnl

Bsnl

2025 కొత్త ఏడాది సందర్భంగా దేశీయ ప్రభుత్వ రంగ టెలికం దిగ్గజం బీఎస్ఎన్ఎల్ అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్ ప్రవేశపెట్టింది. ఇప్పటికే చాలా రకాల రీఛార్జి ప్లాన్లను అందుబాటులోకి తీసుకువచ్చిన బిఎస్ఎన్ఎల్ సంస్థ, ఇప్పుడు న్యూ ఇయర్ సందర్భంగా అభిమానులకు మరో సర్ప్రైజ్ ను ఇస్తూ కొత్త రీఛార్జి ప్లాన్ తీసుకువచ్చింది. 60 రోజుల పాటు 120జీబీ డేటాను అందించే సరసమైన రీఛార్జ్ ప్లాన్‌ను అందిస్తోంది. ఈ లేటెస్ట్ ఆఫర్ జియో, ఎయిర్టెల్ , వీ వంటి ప్రైవేట్ ప్లేయర్‌ లతో పోటీగా అందిస్తోంది. తక్కువ బడ్జెట్ కి మంచి రీఛార్జి ప్లాన్ కోసం చూస్తున్న వారికి ఇది చాలా మంచి ఎంపిక అని చెప్పాలి.

2025 కొత్త ఏడాదికి బీఎస్ఎన్ఎల్ రూ. 277 ధరతో పాకెట్ ఫ్రెండ్లీ ప్లాన్‌ ను ప్రవేశ పెట్టింది. ఇంటర్నెట్ ఎక్కువగా వాడే వినియోగదారులు, వ్యాలిడిటీ పొడిగింపు కోసం చూస్తున్న వారికి ఈ ప్లాన్ బెస్ట్ అని చెప్పాలి. 2జీబీ రోజువారీ క్యాప్‌తో యూజర్లు సజావుగా బ్రౌజ్ చేయవచ్చు. స్ట్రీమ్ చేయవచ్చు. అలాగే పూర్తి రెండు నెలల పాటు రీఛార్జ్‌ లు అవసరం లేదు. అయితే ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. వచ్చేనెల జనవరి 16లోపు ఈ రీఛార్జ్ చేసుకోండి. మోర్ డేటా, మోర్ ఫన్ అని పేరుతో కొత్త ప్లాన్ లిమిటెడ్ టైమ్ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. బీఎస్ఎన్ఎల్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ద్వారా ఆఫర్‌ ను ప్రకటించింది.

జనవరి 16, 2025 వరకు చెల్లుబాటులో ఉంటుందని పేర్కొంది. బీఎస్ఎన్ఎల్ ఆకర్షణీయమైన ఆఫర్‌ లను అందించడమే కాకుండా భారత్ అంతటా 4జీ నెట్‌వర్క్ విస్తరణను వేగవంతం చేస్తోంది. ఇప్పటికే 60 వేలకు పైగా 4జీ టవర్లు పనిచేస్తుండగా, త్వరలో 5 జీ సేవలను ప్రారంభించేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. ప్రైవేట్ టెలికాం దిగ్గజాలతో అంతరాన్ని తగ్గించడమే కాకుండా దేశవ్యాప్తంగా వినియోగదారులకు మెరుగైన కనెక్టివిటీని అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది బీఎస్ఎన్ఎల్.