Site icon HashtagU Telugu

BSNL: బంపర్ ఆఫర్ ప్రకటించిన బీఎస్ఎన్ఎల్.. తక్కువ ధరకే ఐదు నెలల వ్యాలిడిటీ!

Bsnl

Bsnl

గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లలో బీఎస్‌ఎన్‌ఎల్‌ పేరు కూడా ఒకటి. ప్రముఖ టెలికాం కంపెనీ అయినా బీఎస్‌ఎన్‌ఎల్‌ పేరు గత కొద్ది రోజులుగా మారుమగుతున్న విషయం తెలిసిందే. ఎయిర్టెల్ జియో లాంటి టెలికాం కంపెనీలు రీఛార్జ్ ధరలను భారీగా పెంచడంతో ప్రతి ఒక్కరి చూపు బీఎస్‌ఎన్‌ఎల్‌ వైపు మళ్ళింది. దానికి తోడు బిఎస్ఎన్ఎల్ కూడా అద్భుతమైన ఆఫర్లను ప్రకటిస్తుండడంతో ఇప్పటికే చాలామంది బీఎస్‌ఎన్‌ఎల్‌ కి పోర్ట్ అయ్యారు.. అంతేకాకుండా బీఎస్‌ఎన్‌ఎల్‌ సంస్థ కూడా ఫోర్ జి, ఫైవ్ జి నెట్వర్క్ లను వేగవంతం చేయడానికి గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది.

రీఛార్జీలు పెరిగిన నేపథ్యంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ ఇతర టెలికాం కంపెనీల కంటే తక్కువ ధరలోనే కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. అందులో భాగంగానే ఇప్పటికే చాలాసార్లు మంచి మంచి ఆఫర్లను తీసుకువచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌ సంస్థ తాజాగా మరో సరికొత్త రీఛార్జి ప్లాన్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ప్లాన్‌ ధర కేవలం రూ.997. ఇందులో మీరు 160 రోజుల పాటు ప్లాన్‌ వ్యాలిడిటీ లభిస్తుంది. అంటే 5 నెలల వ్యాలిడిటీ లభిస్తుంది. ఈ ప్లాన్‌తో పాటు ప్రతిరోజూ మీరు 2జీబీ డేటా, ఐదు నెలల మొత్తం 320జీబీ పాటు అందించనుంది. అంతేకాదు ఇందులో ప్రతిరోజు 100 ఎస్‌ఎంఎస్‌ లు కూడా ఉచితం, దేశవ్యాప్తంగా ఉచిత కాలింగ్‌ పొందే అవకాశం ని పొందవచ్చు.

అయితే ఇందుకోసం మీరు 997 రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే సరిపోతుంది. బీఎస్‌ఎన్‌ఎల్ ఈ సరికొత్త ప్లాన్‌లో భాగంగా మీరు కొన్ని వ్యాల్యూ యాడెడ్‌ సేవలు కూడా పొందవచ్చు. హార్డీ గేమ్స్, జింగ్‌ మ్యూజిక్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌ ట్యూన్‌ అంటే కస్టమర్లకు బీఎస్‌ఎన్‌ఎల్‌ కనెక్టివిటీతో పాటు ఎంటర్‌టైన్మెంట్‌ ను కూడా అందిస్తోంది. బీఎస్‌ఎన్‌ఎల్‌ అక్టోబర్‌ 15 నుంచి 4 జీ సేవలను ప్రారంభించనుంది. 25 వేల 4జీ సైట్లను కూడా ఇన్‌స్టాల్‌ చేసినట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ సర్వీస్‌ ట్రయల్‌ స్టేజీని కూడా పూర్తి చేసుకుంది. అందుకే కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే బీఎస్‌ఎన్‌ఎల్‌ 4 జీ సిమ్‌లను కూడా అందుబాటులో ఉంచింది. ఇలా మొత్తానికి ఈ బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ.997 రీఛార్జీ ప్లాన్‌ తో ఎక్కువ రోజుల పాటు వ్యాలిడిటీ, డేటా, కాలింగ్‌ సర్వీసులు కూడా పొందుతారు. భవిష్యత్తులో 5 జీ సేవలను కూడా అందించేందుకు కూడా ప్రణాళికలు వేస్తూ ఇతర టెలికాం దిగ్గజ కంపెనీలకు ఈ ప్రభుత్వ రంగ సంస్థ గట్టి పోటీనే ఇస్తోంది.