ప్రముఖ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ గురించి మనందరికీ తెలిసిందే. జియో ఎయిర్టెల్ వంటి టెలికాం సంస్థలు రీఛార్జ్ ధరలను భారీగా పెంచడంతో అలాంటి సమయంలో తక్కువ ధరకే అద్భుతమైన రీచార్జ్ ప్లాన్ ను తీసుకువచ్చి వినియోగదారులను బాగా ఆకట్టుకుంది. అయితే ఇప్పటికే చాలామంది టెలికాం కి పోర్టు అయిన విషయం తెలిసిందే. ఇంకా కొంతమంది అవుతున్న నేపద్యంలో టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త రీఛార్జ్ ప్లాన్లను తీసుకు వస్తూనే ఉంది.
అలాగే ఇతర ప్రైవేట్ టెలికాం కంపెనీలతో పోలిస్తే బీఎస్ఎన్ఎల్ తన వినియోగదారులకు చాలా సరసమైన, చౌకైన రీఛార్జ్ ప్లాన్ లను అందిస్తోంది. ఈ కారణంగా చాలా మంది తమ నంబర్ లను బిఎస్ఎన్ఎల్ కు పోర్ట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు బీఎస్ఎన్ఎల్ తన పోస్ట్ పెయిడ్ వినియోగదారుల కోసం ఒక గొప్ప రీఛార్జ్ ప్లాన్ ను ప్రవేశపెట్టింది. బీఎస్ఎన్ఎల్ ఈ కొత్త రీఛార్జ్ ప్లాన్ గురించి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్టర్ లో పోస్ట్ చేయడం ద్వారా సమాచారం ఇచ్చింది. బీఎస్ఎన్ఎల్ తన పోస్ట్‌లో రూ.399 పోస్ట్ పెయిడ్ ప్లాన్ గురించి తెలిపింది.
ఈ ప్లాన్ లో, వినియోగదారులకు చాలా మంచి ప్రయోజనాలు పొందుతారు. ఇకపోతే ఆ వివరాల్లోకి వెళితే.. బీఎస్ఎన్ఎల్ ఈ రూ.399 పోస్ట్ పెయిడ్ ప్లాన్ లో మీరు అపరిమిత ఉచిత కాలింగ్ ప్రయోజనాన్ని పొందవచ్చట. దీనితో పాటు మీరు రోజుకు 100 ఉచిత SMS ప్రయోజనాన్ని కూడా పొందవచ్చట. ఇకపోతే డేటా విషయానికొస్తే.. ఈ ప్లాన్‌లో, వినియోగదారులకు మొత్తం 70జీబీ డేటాను అందిస్తోంది. ఇది మాత్రమే కాదు, ఈ ప్లాన్ లో డేటా రోల్ ఓవర్ ప్రయోజనం కూడా ఉంది. అంటే, మీరు మీ మిగిలిన డేటాను కూడా ఉపయోగించవచ్చట. దీనిలో మీరు మొత్తం 210జీబీ డేటాను ఆదా చేసుకోవచ్చట. దానిని ఉపయోగించవచ్చట. ఈ పోస్ట్ పెయిడ్ ప్లాన్ 1 నెల చెల్లుబాటు ఉంటుందట. బీఎస్ఎన్ఎల్ తన 5జీ సేవలను అతి త్వరలో ప్రారంభిస్తుందని ఇటీవల టెలికాం శాఖ మంత్రి తెలిపారు. అటువంటి పరిస్థితిలో రాబోయే కాలంలో బీఎస్ఎన్ఎల్ వినియోగదారుల సంఖ్య మరింత పెరుగుతుందట.