గత కొద్ది రోజులుగా ప్రముఖ టెలికాం కంపెనీ అయిన బీఎస్ఎన్ఎల్ పేరు మారుమోగుతున్న విషయం తెలిసిందే. ఈ టెలికాం కంపెనీ తో పాటు చాలా రకాల టెలికాన్ కంపెనీలు ఉన్నప్పటికీ ఈ పేరు మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ముఖ్యంగా ఎయిర్టెల్, జియో వంటి టెలికాం కంపెనీలు రీఛార్జ్ ప్లాన్ ధరలను భారీగా పెంచడంతో ఈ బిఎస్ఎన్ఎల్ కు క్రేజ్ పెరిగిపోయింది. ఇటువంటి సమయంలోనే బిఎస్ఎన్ఎల్ సంస్థ తక్కువ ధరకే అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్ ధరలను అందిస్తుండడంతో వినియోగదారులు ఇప్పటికే చాలామంది బిఎస్ఎన్ఎల్ కి పోర్ట్ అయిపోయారు.
అయితే ఇప్పటికే చాలా రకాల రీఛార్జి ప్లాన్ల ధరలను తీసుకువచ్చిన బిఎస్ఎన్ఎల్ సంస్థ ఇప్పుడు కొత్త ప్లాన్లను వినియోగదారుల అందుబాటులోకి తీసుకువస్తోంది. ప్రైవేట్ టెలికాం కంపెనీలు రీఛార్జ్ ప్లాన్ ధరలను పెంచేయడంతో బీఎస్ఎన్ఎల్ కొత్త ఆఫర్లను ప్రకటిస్తూ వీటిని అతి తక్కువ ధరలోనే అందుబాటులో ఉంచుతుంది. మరి తాజాగా తీసుకువచ్చిన ఆ కొత్త ప్లాన్ ఏంటి? దాని ధర ఎంత? అన్న వివరాల్లోకి వెళితే.. బిఎస్ఎన్ఎల్ సంస్థ తీసుకువచ్చిన కొత్త ప్లాన్ ధర. రూ. 347. కస్టమర్లు 54 రోజుల వాలిడిటీ పొందుతారు. దీంతో పాటు ఇతర బెనిఫిట్స్ కూడా అందుకుంటారు. ఈ ప్లాన్ తో కస్టమర్లు అపరిమిత కాలింగ్ తో పాటుగా, 54 రోజులు పాటు వ్యాలిడిటీ ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్లు ఉచితంగా పొందవచ్చు.
ఈ ప్లాన్ లో 165 జీబీ డేటా పొందుతారు అంటే ప్రతిరోజు 3జీబీ డేటా దీంతో పాటు అదనంగా మరో మూడు 3 జీబీ కూడా ఉచితంగా పొందుతారు. బిఎస్ఎన్ఎల్ ఈ ప్లాన్ తో పాటు మరిన్ని బెనిఫిట్స్ పొందుతారు ముఖ్యంగా బిఎస్ఎన్ఎల్ హార్డ్డి గేమ్స్ ,ఛాలెంజర్ అరే నా గేమ్స్, గేమ్ ఆస్ట్రో టెల్, జింగ్ మ్యూజిక్, ఎంటర్టైన్మెంట్ బిఎస్ఎన్ఎల్ ట్యూన్స్ పొందుతారు. బిఎస్ఎన్ఎల్ కొత్తరకం ఆఫర్లతో జియో ఎయిర్టెల్ గట్టి పోటీని అందిస్తోంది. అంతే కాదు బిఎస్ఎన్ఎల్ ఎంటిఎన్ఎల్ కూడా సూపర్ ఫాస్ట్ కనెక్టివిటీని పెంచాయి. ఇక మొబైల్ టవర్స్ కూడా అప్ గ్రేడింగ్ చేస్తూ 4జీ సేవలను విస్తృతం చేస్తున్న బిఎస్ఎన్ఎల్ 5జీ సర్వీస్ ని కూడా త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తామా చెబుతోంది. ఇప్పటికే ఈ 5జీ సేవలకు సంబంధించిన టెస్టింగ్ కూడా మొదలైంది. వీలైనంత తొందరగా 5జీ సేవలను కూడా పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొని రావడానికి బీఎస్ఎన్ఎల్ సంస్థ గట్టిగానే కృషి చేస్తోంది.