Site icon HashtagU Telugu

BSNL 4G: మీరు కూడా బీఎస్ఎన్ఎల్ కి మారాలనుకుంటున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!

Bsnl

Bsnl

ఈ మధ్యకాలంలో మొబైల్ ఫోన్ రీఛార్జ్ ల ధరలను భారీగా పెంచడంతో వినియోగదారులు తక్కువ రీఛార్జ్ లు ఏ నెట్ వర్క్ లో అయితే ఉన్నాయో దానికి మారాలని అనుకుంటున్నారు. అయితే జియో, ఎయిర్టెల్ నెట్ వర్క్ లు రీఛార్జ్ ధరలను భారీగా పెంచడంతో వినియోగదారులు ఎక్కువ మంది బీఎస్‌ఎన్‌ఎల్‌ కి మారుతున్నారు. ఇప్పటికే చాలామంది బిఎస్ఎన్ఎల్ కి మారగా మరి కొంతమంది బిఎస్ఎన్ఎల్ కి పోర్ట్ కూడా పెట్టారు. అయితే రోజురోజుకీ బిఎస్ఎన్ఎల్ వినియోగదారుల సంఖ్య పెరిగిపోతుండడంతో 4G సేవలను చాలా త్వరగా అందుబాటులోకి తెచ్చే ప్రక్రియలో ఉంది.

దీనిపై ప్రభుత్వం కూడా చాలా చక్కగా స్పందిస్తోంది. BSNL 4G సేవలను పర్యవేక్షించడానికి ప్రభుత్వం పనితీరు మానిటరింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేస్తుందని కేంద్ర సమాచార కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అంతకుముందు తెలిపారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ కి ఇంత మంది వచ్చినప్పుడు, వారికి అవసరమైన నెట్‌వర్క్ కవరేజీని కంపెనీ అందించగలదా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ విధంగా, బీఎస్‌ఎన్‌ఎల్‌ తీసుకోవాలనుకుంటున్న వారు సమీపంలోని టవర్లను కూడా తనిఖీ చేయవచ్చు. మరి ఇంతకీ బిఎస్ఎన్ఎల్ టవర్లను ఎలా తనిఖీ చేయాలి అన్న విషయానికి వస్తే..

ఇందుకోసం ముందుగా https://tarangsanchar.gov.in/emfportal వెబ్‌సైట్‌ వెళ్ళాలి. తర్వాత క్రిందికి స్క్రోల్ చేసి మై పోసిషన్ పై క్లిక్ చేయాలి. ఆపై స్క్రీన్‌పై మీ పేరు, ఇమెయిల్, మొబైల్ నంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి. ఓటీపీ ని ఉపయోగించి మెయిల్ పంపు పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఓటీపీ ని నమోదు చేయాలి. స్క్రీన్‌పై మీకు సమీపంలోని అన్ని సెల్ ఫోన్ టవర్‌ల మ్యాప్ కనిపిస్తుంది. సిగ్నల్ 2G/3G/4G లేదా 5G ఆపరేటర్‌ని పొందడానికి ఏదైనా టవర్‌పై క్లిక్ చేయాలి.