Site icon HashtagU Telugu

BSNL 4G: మీరు కూడా బీఎస్‌ఎన్‌ఎల్‌కి పోర్ట్ అవుతున్నారా.. అయితే నెట్‌వర్క్ ఎక్కడెక్కడ ఉందో తెలుసుకోండిలా!

Bsnl 4g

Bsnl 4g

ఇటీవల కాలంలో ప్రముఖ టెలికాం సంస్థలు మొబైల్ రీఛార్జ్ ధరలను భారీగా పెంచిన విషయం తెలిసిందే. జియో ఎయిర్టెల్ వంటి టెలికాం సంస్థలు రీఛార్జ్ ధరలను భారీగా పెంచాయి. ఇలాంటి సమయంలోనే బీఎస్‌ఎన్‌ఎల్‌ సంస్థ తక్కువ ధరకే అద్భుతమైన రీచార్జ్ ప్లాన్లను తీసుకురావడంతో ప్రతి ఒక్కరూ బిఎస్ఎన్ఎల్ వైపు ముగ్గు చూపారు. వినియోగదారులను మరింత ఆకర్షించడం కోసం తక్కువ ధరకే మంచి మంచి రీఛార్జ్ ప్లాన్లను తీసుకువచ్చింది. ఇప్పటికే చాలామంది బిఎస్ఎన్ఎల్ కి పోర్టు అయిన విషయం తెలిసిందే.

వినియోగదారుల సంఖ్యను మరింత పెంచుకోవడం కోసం బీఎస్‌ఎన్‌ఎల్‌ ఇప్పుడు తన వినియోగదారులకు 4జీ సేవలను చాలా త్వరగా అందుబాటులోకి తెచ్చే ప్రక్రియలో ఉంది. దీనిపై ప్రభుత్వం కూడా చాలా చక్కగా స్పందిస్తోంది. బీఎస్‌ఎన్‌ఎల్ 4జీ సేవలను పర్యవేక్షించడానికి ప్రభుత్వం పనితీరు మానిటరింగ్ యూనిట్‌ ను ఏర్పాటు చేస్తుందని కేంద్ర సమాచార, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా గతంలో చెప్పారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ కి ఇంత మంది వచ్చినప్పుడు, వారికి అవసరమైన నెట్‌వర్క్ కవరేజీని కంపెనీ అందించగలదా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ విధంగా, బీఎస్‌ఎన్‌ఎల్‌ తీసుకోవాలనుకుంటున్న వారు సమీపంలోని టవర్లను కూడా తనిఖీ చేయవచ్చట.

మరి దగ్గరలో ఉన్న టవర్లను ఏ విధంగా కనుగొనవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అయితే ఇందుకోసం ముందుగా https://tarangsanchar.gov.in/emfportal వెబ్‌సైట్‌ కి వెళ్ళాలి. తర్వాత క్రిందికి స్క్రోల్ చేసి మై పొజిషన్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. స్క్రీన్‌ పై మీ పేరు, ఇమెయిల్, మొబైల్ నంబర్, క్యాప్చా నమోదు చేయాలి. తర్వాత ఓటీపీ ని ఉపయోగించి మెయిల్ పంపు ఆప్షన్ పై క్లిక్ చేయాలి. తర్వాత ఓటీపీని నమోదు చేయాలి. అప్పుడు స్క్రీన్‌ పై మీకు సమీపం లోని అన్ని సెల్ ఫోన్ టవర్‌ ల మ్యాప్ కనిపిస్తుంది. సిగ్నల్ 2జీ/3జీ/4జీలేదా 5జీ), ఆపరేటర్‌ ని పొందడానికి ఏదైనా టవర్‌ పై క్లిక్ చేయాలట. ఈ విధంగా ఈజీగా మీరు దగ్గరలో బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ ని తెలుసుకోవచ్చట..