ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీ బీఎస్‌ఎన్‌ఎల్ మనందరికీ తెలిసిందే. ఇటీవల కాలంలో మిగతా టెలికాం కంపెనీలతో పోల్చుకుంటే బీఎస్‌ఎన్‌ఎల్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. మరి ముఖ్యంగా గడిచిన మూడు నాలుగు నెలలుగా ఈ బీఎస్ఎన్ఎల్ పేరే ఎక్కువగా వినిపిస్తోంది. ఇప్పటికే చాలామంది బీఎస్ఎన్ఎల్ కి పోర్ట్ అయిన విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగానే బీఎస్‌ఎన్‌ఎల్ సంస్థ వినియోగదారులను మరింత ఆకర్షించడం కోసం అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు 5జీ సేవలను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావడానికి గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది.
ఇటీవల కాలంలోనే చాలా రకాల రీఛార్జి ప్లాన్లను తీసుకువచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్ తాజాగా మరో అద్భుతమైన ప్లాన్ ని తీసుకువచ్చింది. మరి తాజాగా అందుబాటులోకి తీసుకువచ్చిన ఆ కొత్త రీఛార్జి ప్లాన్ ఏంటి అన్న విషయానికి వస్తే.. బీఎస్‌ఎన్‌ఎల్ సిమ వినియోగిస్తున్నట్లయితే మీకు శుభవార్త. అదేమిటంటే బీఎస్‌ఎన్‌ఎల్ రూ.397 ప్లాన్ తో మీరు 150 రోజుల వ్యాలిడిటీ పొందవచ్చు. బీఎస్‌ఎన్‌ఎల్ రీఛార్జీ ప్లాన్‌తో మీరు ఎన్నో లాభాలు పొందుతారు. ముఖ్యంగా ఈ ప్లాన్‌లో ఎక్కువ రోజుల వ్యాలిడిటీతో పాటు ఉచిత వాయిస్ కాలింగ్, ప్రతిరోజూ 2 జీబీ డేటా పొందవచ్చు. చౌక ధరలో రోజూ 2 జీబీ డేటా సూపర్ ప్లాన్ అని చెప్పాలి. అంతేకాదు ఈ బీఎస్‌ఎన్‌ఎల్ రీఛార్జీ ప్లాన్‌లో ప్రతిరోజూ 100 ఎస్‌ఎంఎస్‌లు కూడా పొందవచ్చట.
కానీ ఈ బెనిఫిట్స్ మాత్రం కేవలం నెల రోజులు మాత్రమే పొందుతారు. అంటే మీ సిమ్ యాక్టీవ్ లో ఉండాలనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పాలి. టెలికాం ధరలు జూలై నెలలో అన్ని ప్రైవేటు కంపెనీలు పెంచేశాయి. ఈ నేపథ్యంలో తక్కువ ధరలో అందుబాటులో ఉన్న బీఎస్‌ఎన్‌ఎల్‌కు ఎక్కువ మంది పోర్ట్ అయ్యారు. మరిన్నీ ఆకర్షణీయమైన ధరలను వినియోగదారుల ముందుకు తీసుకువస్తూ ఈ ప్రభుత్వ కంపెనీ మరింత మంది కస్టమర్లను ఆకట్టుకుంటోంది..