Site icon HashtagU Telugu

Boult Crown: మార్కెట్ లోకి మరో కొత్త స్మార్ట్ వాచ్.. ధర, ఫీచర్స్ ఇవే?

Boult Crown

Boult Crown

రోజురోజుకి స్మార్ట్ వాచ్ ల వినియోగదారుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. దీంతో ఆయా కంపెనీలు వినియోగదారులను ఆకర్షించడం కోసం కొత్త కొత్త ఫీచర్లు కలిగిన స్మార్ట్ వాచ్ లను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి. ఇప్పటికే పదుల సంఖ్యలో స్మార్ట్ వాచ్ లు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా మార్కెట్లోకి మరో సరికొత్త స్మార్ట్ వాచ్ విడుదల అయింది. కాగా మామూలుగా యాపిల్ అల్ట్రా స్మార్ట్ వాచ్ కొనుగోలు చేయాలి అంటే కచ్చితంగా రూ.60 వేలు పెట్టాల్సిందే.

అంత బడ్జెట్ పెట్టి స్మార్ట్ వాచ్ ని కొనుగోలు చేయలేని వారు అలాంటి లుక్ తో ఉన్న వాచ్ ను కేవలం రూ. 1500కె లభిస్తే.. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. అచ్చం ఆపిల్ అల్ట్రా స్మార్ట్ వాచ్ లుక్ తో ఉన్న సరికొత్త స్మార్ట్ వాచ్ ని మార్కెట్ లోకి విడుదల చేసింది బౌల్ట్ కంపెనీ. ఆ వివరాల్లోకి వెళితే..బౌల్ట్‌ క్రౌన్‌ పేరుతో భారత మార్కెట్లోకి కొత్త స్మార్ట్ వాచ్‌ను లాంచ్‌ చేసింది. ఈ స్మార్ట్‌ వాచ్‌ ధర రూ. 1499గా ఉంది. అచ్చంగా యాపిల్‌ అల్ట్రా వాచ్‌ స్టైల్‌లో డిజైన్‌ చేసిన ఈ స్మార్ట్‌ వాచ్‌ మరిన్ని వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఇకపోతే ఈ స్మార్ట్ వాచ్ ఫీచర్ల విషయానికొస్తే.. 1.95 ఇంచెస్‌ హెచ్‌డీ డిస్‌ప్లేను అందించారు. ఈ వాచ్‌ స్క్రీన్‌ గరిష్టంగా 900 నిట్‌ల వరకు బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. ఈ వాచ్‌లో బ్లూటూత్‌ 5.2 కనెక్టివిటీ అందించారు. బ్లూటూత్‌ కాలింగ్‌ చేసుకోవచ్చు. ఇక హెల్త్‌ ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో ఎస్‌పీఓ2 సెన్సార్‌, హార్ట్ రేట్ ట్రాకర్‌, బ్లడ్‌ ప్రెజర్‌ మానిటర్‌, ఫిమేల్‌ హెల్త్‌ మానిటర్‌, స్లీప్‌ ట్రాకింగ్ వంటి ఫీచర్లను అందించారు. 100కిపైగా స్పోర్ట్స్‌ మోడల్స్‌ ఈ వాచ్‌ ప్రత్యేకత. 150 కంటే ఎక్కువ వాచ్‌ ఫేస్‌లుఉన్నాయి. ఏఐ వాయిస్‌ అసిస్టెన్స్‌ ఈ వాచ్‌ మరో ప్రత్యేకత. డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌ కోసం ఐపీ676 ప్రొటెక్షన్‌ అందించారు.