Site icon HashtagU Telugu

iPhone 15: క్రోమాలో ఐఫోన్ 15 సిరీస్ అడ్వాన్స్ బుకింగ్ ఆఫర్స్

iPhone 15

Logo (19)

iPhone 15: సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ప్రముఖ మొబైల్ సంస్థ ఐఫోన్ 15 ను మార్కెట్లోకి విడుదల చేసింది. సెప్టెంబర్ 12న ఐఫోన్ 15 మార్కెట్లోకి వచ్చింది. అయితే ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో , ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ లను క్రోమాలో ముందస్తుగా బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ప్రముఖ టాటా యాజమాన్యంలోని ఎలక్ట్రానిక్స్ రిటైల్ స్టోర్ క్రోమా స్టార్ లో ఐఫోన్ 15  సిరీస్‌ ప్రీ-బుకింగ్ వివరాలను ప్రకటించింది. దీంతో కేవలం రూ.2,000తో ప్రీ-బుక్ చేసుకోవచ్చు. అదేవిధంగా కొనుగోలుదారులు క్రోమా నుండి కొత్త యాపిల్ వాచ్ సిరీస్ 9 మరియు యాపిల్ వాచ్ అల్ట్రాను రూ 2,000తో ప్రీ-బుక్ చేయవచ్చు.అదనంగా కొనుగోలుదారులు 24 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ మరియు అదనపు తగ్గింపులను పొందవచ్చు.

ప్రీ-బుకింగ్ ఆఫర్ దేశవ్యాప్తంగా క్రోమా వెబ్‌సైట్ మరియు ఆఫ్‌లైన్ స్టోర్‌ రెండింటిలోనూ వర్తిస్తుంది. అలాగే కొత్త ఐఫోన్‌లు, యాపిల్ వాచ్ సిరీస్ 9 మరియు అల్ట్రా 2 సెప్టెంబర్ 22 నుండి అందుబాటులో ఉంటాయి మరియు ప్రీ-బుకింగ్ సెప్టెంబర్ 21 న ముగుస్తుంది.

ఐఫోన్ 15 సిరీస్ యొక్క ఫీచర్లు:
ఐఫోన్ 15 మరియు ఐఫోన్ 15 ప్లస్ నలుపు, ఆకుపచ్చ, గులాబీ, పసుపు మరియు నీలం రంగులలో లభిస్తాయి. ఐఫోన్ 15 ప్రో మరియు ప్రో మాక్స్ నేచురల్ టైటానియం, బ్లూ టైటానియం, నలుపు రంగులలో సరికొత్త టైటానియంలో లభిస్తాయి.

ప్రీ-బుకింగ్ ఆఫర్‌లో భాగంగా మొదటిసారిగా ఐఫోన్ 15 సిరీస్‌ను ముందస్తుగా బుక్ చేసుకుంటే Cordilla Cruiseలో Croma Cruise Control 4.0 టిక్కెట్‌లను గెలుచుకునే అవకాశాన్ని క్రోమా అందిస్తోంది. కొనుగోలుదారులు 24 నెలల వరకు నో-కాస్ట్ లతో క్రెడిట్ కార్డ్‌ల ద్వారా చెల్లించే అవకాశం ఉంటుంది.

Also Read: Drugs Case : డ్ర‌గ్స్ కేసులో ముంద‌స్తు బెయిల్ కోసం హైకోర్టులో హీరో న‌వ‌దీప్ పిటిష‌న్‌.. మంగ‌ళ‌వారం వ‌ర‌కు..?