Smart Watch: అతి తక్కువ ధరకే బోట్ స్మార్ట్ వాచ్.. ధర ఎంతో తెలుసా?

ఇదివరకు స్మార్ట్ వాచ్ లు చాలా అరుదుగా కనిపించేవి. అయితే ఇవి మార్కెట్లోకి వచ్చిన సమయంలో ప్రతి ఒక్కరి దృష్టి

  • Written By:
  • Updated On - July 13, 2022 / 11:05 AM IST

ఇదివరకు స్మార్ట్ వాచ్ లు చాలా అరుదుగా కనిపించేవి. అయితే ఇవి మార్కెట్లోకి వచ్చిన సమయంలో ప్రతి ఒక్కరి దృష్టి కూడా ఆ స్మార్ట్ వాచ్ పైనే. అయితే రాను రాను టెక్నాలజీ మారిపోవడంతో ఆ స్మార్ట్ వాచ్ కాస్త ఫ్యాషన్ వేర్ గా మారిపోయింది. దీనితో స్మార్ట్ ఫోన్ తయారు చేసే కంపెనీలు ఎన్నో రకాల ఫ్యూచర్లతో వినియోగదారుల కోసం సౌకర్యవంతమైన స్మార్ట్ ఫోన్ లను మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకొని వస్తున్నారు. అయితే ఈ మధ్యకాలంలో అయితే స్మార్ట్ వాచ్ ట్రెండ్ మరింత పెరుగుతోంది.

అందుకు తగ్గట్టుగా ప్రముఖ సంస్థ బోట్ స్మార్ట్ ప్రో పేరుతో సరికొత్తగా ఒక స్మార్ట్ వాచ్ ను విడుదల చేసింది. అయితే స్మార్ట్ వాచ్ ధర చాలా తక్కువగా ఉండడం ఆశ్చర్యం కలిగించే విషయం. తాజాగా విడుదల చేసిన బోట్ స్మార్ట్ ప్రో ధర రూ.2,999. దీని డిస్ ప్లే 1.78 అంగుళాలు ఉంటుంది. 60 హెర్జ్ రీఫ్రెష్ రేటుతో వస్తుంది. అయితే ఈ బోట్ స్మార్ట్ ప్రో వాచ్ లో 700కు పైగా ఫిట్ నెస్ మోడ్ లు ఉన్నట్టు కంపెనీ చెబుతోంది. ఇందులో గుండెకు స్పందనలను కూడా రీడ్ చేసుకోవచ్చట.

అలాగే ప్రతి క్యాలరీ ఖర్చును కూడా ఇది నోట్ చేస్తుందట. 24 గంటల పాటు హార్ట్ రేట్ ను పర్యవేక్షించే సెన్సార్, రక్తంలో ఆక్సిజన్ ను సూచించే ఎస్పీవో2, నిద్ర ట్రాకింగ్, నడిచే అడుగులను లెక్కించడం,ఫిట్ నెస్ ఇలా ఎన్నో రకాల ఫీచర్లతో ఈ బోట్ స్మార్ట్ ప్రో వాచ్ ని అందుబాటులోకి తీసుకొని వచ్చారు. ఈ వాచ్ ప్రారంభం ధర రూ.2,999 ఉన్నట్లు కంపెని పేర్కొంది. యాక్టివ్ బ్లాక్, కూల్ గ్రే, డీప్ బ్లూ రంగుల్లో లభించే ఈ స్మార్ట్ వాచ్ ను ఫ్లిప్ కార్ట్, బోట్ లైఫ్ స్టయిల్ డాట్ కామ్ నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. అలాగే ఈ బోట్ స్మార్ట్ ప్రో వాచ్ మనకు మూడు కలర్ లలో లభిస్తుందట.