Site icon HashtagU Telugu

boAt Smart Ring : ఇది రింగ్ కాదు కే’రింగ్’.. బోట్ నుంచి స్పెషల్ రింగ్ వచ్చేస్తుంది..

boAt Smart Ring coming soon use for all health updates and tracking

boAt Smart Ring coming soon use for all health updates and tracking

తక్కువ బడ్జెట్ లోనే కొత్త కొత్త ప్రోడక్ట్స్ రిలీజ్ చేసే బ్రాండ్ గా చెప్పచ్చు బోట్(boAt) ని. ఇప్పటికే మధ్యతరగతి వారికి కూడా అందుబాటు ధరల్లో స్మార్ట్‌వాచ్‌లు (smartwatch), హెడ్‌ఫోన్స్(headphones), స్పీకర్స్(speakers), ఇయర్‌బడ్స్(earbuds) లాంటి ప్రొడక్ట్స్ లాంచ్ చేసి చాలా పాపులర్ అయింది. వాటికి మంచి డిమాండ్ కూడా ఉంది. ఇప్పుడు బోట్ మరొక స్మార్ట్ ప్రొడక్ట్‌ను పరిచయం చేసింది. అదే బోట్ స్మార్ట్ రింగ్( boAt Smart Ring).

ఈ స్మార్ట్ రింగ్ సిరామిక్, మెటల్ కలయికతో తయారు చేయడంతో రిచ్ అండ్ ప్రీమియర్ లుక్ ఇస్తుంది. చూడటానికి అందంగా ఉన్న ఈ ఉంగరం చేతికి పెట్టుకోగానే మన హెల్త్‌ ట్రాకర్‌ (health tracker)గా మారిపోతుంది. boAt Smart Ring ధరించిన వారి హృదయ స్పందన రేటు(హార్ట్ బీట్), శరీర ఉష్ణోగ్రత గురించి సమాచారంతో పాటు, స్లీప్ క్వాలిటీ వంటి హెల్త్, ఫిట్‌నెస్ వివరాలను ట్రాక్ చేస్తుంది.  ఇది వాటర్ రెసిస్టెన్స్ కలిగి ఉండటం వల్ల నీటిలో పడినా సురక్షితంగా ఉంటుంది. భారతీయ మార్కెట్లో, ఈ రింగ్ అల్ట్రా హ్యూమన్ రింగ్ ఎయిర్, శాంసంగ్ గెలాక్సీ రింగ్‌తో పోటీపడుతుంది.

చూడటానికి చిన్న రింగే కావచ్చు కానీ ఇది మొత్తం ఒక స్మార్ట్‌వాచ్ అందించిన ఫీచర్లను అన్నింటినీ అందిస్తుంది. ఇందులోని SpO2 మీటర్ స్మార్ట్ ఇది రక్తంలో ఆక్సిజన్ స్థాయిని కొలుస్తుంది. ఇది శ్వాసకోశ సమస్యలు తలెత్తినప్పుడు తక్షణమే స్పందించడానికి సహాయపడుతుంది. రింగ్ నుంచి స్లీపింగ్ సైకిల్‌ను కూడా ట్రాక్ చేయవచ్చు. ఈ మొత్తం డేటా బోట్ రింగ్ యాప్‌లో స్టోర్‌ అవుతుంది. దీంతో యూజర్లు తమ ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు మార్పులు చేర్పులతో జాగ్రత్త పడచ్చు కూడా.

ఇక స్మార్ట్ రింగ్ మహిళల కోసం మెన్‌స్ట్రువల్ ట్రాకర్ ని కూడా అందిస్తోంది. ఇది పీరియడ్ ట్రాకింగ్, ప్రిడిక్షన్ లను నోటిఫికేషన్లు, రిమైండర్ల ద్వారా కూడా అందించగలదు. అయితే ఈ స్మార్ట్ రింగ్ మార్కెట్ లాంచ్ తేదీ గురించి ఇంకా సమాచారం లేదు. ఆగస్ట్‌లో ఈ రింగ్‌ను మార్కెట్లోకి విడుదల చేయవచ్చని భావిస్తున్నారు. మార్కెట్ లోకి వచ్చిన తరువాత ఈ బోట్ స్మార్ట్ రింగ్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, బోట్ అధికారిక ఆన్‌లైన్ స్టోర్‌తో సహా ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉండనుంది.

 

Also Read : Palm Payment Technology : చెయ్యి స్కాన్ చేసి బిల్లు కట్టేయచ్చు.. నో క్యాష్, నో కార్డ్.. బయోమెట్రిక్ టెక్నాలజీ..