Site icon HashtagU Telugu

Boat Smartwatch: బోట్ నుంచి మరో స్మార్ట్ వాచ్.. ధర, ఫీచర్స్ ఇవే?

Boat Smartwatch

Boat Smartwatch

దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ వాచ్ ల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. దాంతో ప్రస్తుత రోజులో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు చాలామంది ఈ స్మార్ట్ వాచ్ లపై ఆసక్తిని చూపిస్తున్నారు. అంతేకాకుండా ఈ వాచ్ ల కొనుగోలుదారుల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతూనే ఉంది. దీంతో పలు రకాల స్మార్ట్ వాచ్ కంపెనీలు మార్కెట్ లోకి కొత్త కొత్త స్మార్ట్ వాచ్ లను విడుదల చేస్తూనే ఉన్నాయి. కొత్త కొత్త ఫీచర్ లతో అతి తక్కువ ధరకే స్మార్ట్ వాచ్ లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. అయితే తాజాగా మార్కెట్ లోకి బడ్జెట్ ధరలో మరో స్మార్ట్ వాచ్ కూడా విడుదల అయ్యింది. కాగా ప్రముఖ టెక్ బ్రాండ్ అయిన బోట్ వరుసగా స్మార్ట్‌వాచ్‌లను పరిచయం చేస్తోంది. ఇటీవల అల్టిమా కనెక్ట్ స్మార్ట్‌వాచ్ రిలీజ్ చేసిన బోట్, లేటెస్ట్‌గా లూనార్ కనెక్ట్ ఏస్ మోడల్‌ వాచ్ ను పరిచయం చేసింది. ఇందులో బ్లూటూత్ కాలింగ్ ఫీచర్, ఏఐ వాయిస్ అసిస్టెంట్ ఫీచర్స్ ఉండటం విశేషం. దీంతో పాటు రౌండ్ డయల్ డిజైన్, సిలికాన్, లెదర్, మెటాలిక్ స్ట్రాప్స్ లాంటి ఆప్షన్స్ ఉన్నాయి. కాగా ఈ స్మార్ట్‌వాచ్ ధర కేవలం రూ.2,499 మాత్రమే.

ఈ స్మార్ట్ వాచ్ ఫీచర్ల విషయానికొస్తే… బోట్ లూనార్ కనెక్ట్ ఏస్ స్మార్ట్‌వాచ్‌లో 1.43 అంగుళాల హెచ్‌డీ ఆల్వేస్ ఆన్ అమొలెడ్ స్క్రీన్ ఉంది. 100 పైగా వాచ్ ఫేసెస్‌ని కస్టమైజ్ చేసుకోవచ్చు. బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్ ఉంది. ఇన్ బిల్ట్ మైక్, డయల్ ప్యాడ్ ఉండటం లాంటి ఫీచర్స్ ఉన్నాయి. 10 కాంటాక్ట్స్ సేవ్ చేసుకోవచ్చు. బోట్ లూనార్ కనెక్ట్ ఏస్ స్మార్ట్‌వాచ్‌లో హెల్త్ మానిటరింగ్ ఫీచర్స్ చూస్తే హార్ట్ రేట్, SpO2, మెన్‌స్ట్రువల్ సైకిల్, 100 పైగా స్పోర్ట్స్ మోడ్స్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. IP68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ సపోర్ట్ కూడా ఉంది. ఇతర ఫీచర్స్ చూస్తే కెమెరా కంట్రోల్, మ్యూజిక్ కంట్రోల్, వెదర్, అలారం, కౌంట్‌డౌన్, స్టాప్ వాచ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.

బోట్ లూనార్ కనెక్ట్ ఏస్ స్మార్ట్‌వాచ్‌లో 240ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఫుల్ ఛార్జ్ చేస్తే 10 రోజుల బ్యాటరీ లైఫ్ వస్తుందని కంపెనీ చెబుతోంది. రెండు గంటల్లో ఫుల్ ఛార్జ్ చేయొచ్చు. అలాగే ఈ వాచ్ మనకు సిలికాన్ స్ట్రాప్ చార్‌కోల్ బ్లాక్, ఇండిగో బ్లూ, బీగీ, పర్పుల్ వంటి కలర్స్‌లో లభించనుంది. మెటాల్లిక్ స్ట్రాప్ మెటాల్లిక్ బ్లాక్ కలర్‌లో మాత్రమే లభిస్తుంది. ఇక లెదర్ స్ట్రాప్ బ్రౌన్ కలర్‌లో లభిస్తుంది. బోట్ లూనార్ కనెక్ట్ ఏస్ స్మార్ట్‌వాచ్‌ను ఫ్లిప్‌కార్ట్ , బోట్ అఫీషియల్ వెబ్‌సైట్‌లో కొనొచ్చు. ఇంట్రడక్టరీ ధర రూ.2,499. జూలై 5 మధ్యాహ్నం 12 గంటలకు సేల్ ప్రారంభం కానుంది.