Site icon HashtagU Telugu

BMW: అద్భుతమైన ఫీచర్లతో బీఎండబ్ల్యూ కొత్త బైక్.. ధర తెలిస్తే షాక్?

Bmw 2

Bmw 2

ప్రముఖ బైక్స్ తయారీ సంస్థ బిఎండబ్ల్యూ తాజాగా మోటోరాడ్ సిరీస్ లో 2022 బైక్ మోడల్స్ ను తాజాగా ఇండియా మార్కెట్ లోకి విడుదల చేసింది. బీఎండబ్ల్యూ మోటోరాడ్‌ 2022 మోడల్స్‌ బైక్స్‌ని ప్రీమియం టూరింగ్‌ రేంజ్‌లో బీఎండబ్ల్యూ ఇండియా తీసుకొచ్చింది. టాప్‌ ఎండ్‌ వేరియంట్‌ అయిన కే 1600 గ్రాండ్ అమెరికా ధర దాదాపుగా రూ. 33 లక్షలు ఎక్స్-షోరూమ్ గాను, బేస్‌ వేరియంట్‌ ఆర్‌1250 ఆర్‌టీ ధరను రూ. 23.95 లక్షలు ఎక్స్-షోరూమ్ గాను కంపెనీ నిర్ణయంచింది. కాగా ఆర్ 1250 ఆర్టి , కే 1600 బాగర్, కే 1600 జీటిఎల్ కే 1600 గ్రాండ్ అమెరికా ఇలా నాలుగు వేరియంట్లలో బీఎండబ్ల్యూ మోటోరాడ్ 2022 బైక్స్‌ అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే మొదట బుక్ చేసుకున్న కస్టమర్ లకు ఈ నెలలోనే డెలివరీలు ప్రారంభం కానున్నాయి.

ఫ్రెష్‌ లుక్స్‌, డైనమిక్స్‌ ఫీచర్లతో పాటు, లెజెండరీ 2-సిలిండర్ బాక్సర్ ఇంజన్ బీఎండబ్ల్యూ షిఫ్టకామ్ లాంటి స్పెషల్‌ ఫీచర్లతో లాంగ్‌ హైవే రైడర్లకు స్మూత్‌ రైడింగ్‌ ఫీలింగ్‌ వస్తుందని కంపెనీ తెలిపింది. కే1600లో 6సిలిండర్ ఇన్ లైన్ ఇంజన్ అమర్చింది.ఇది 6750 ఆర్పిఎమ్ వద్ద 160 హెచ్ పి ని, 5250 ఆర్పిఎమ్ వద్ద 180 Nm ఉత్పత్తి చేస్తుంది. ఇక ఆర్ 1250 ఆర్టి లో 1254 సీసీ,ఇంజీన్‌ 7750 ఆర్పిఎమ్ వద్ద 136 హెచ్ పి , 6250 ఆర్పిఎమ్ వద్ద 143 Nm శక్తిని అందిస్తుందట. అయితే బీఎండబ్ల్యూ కే-1600 జీటిఎల్ డ్రాగ్ టార్క్ కంట్రోల్, డైనమిక్ ESA పవర్‌ట్రెయిన్‌, ఇంటిగ్రేటెడ్ నావిగేషన్ కనెక్టివిటీ, కొత్త 10.25-అంగుళాల TFT కలర్ డిస్‌ప్లే అద్భుతమైన రీడబిలిటీ , స్పష్టమైన మెను నావిగేషన్‌, ఆడియో సిస్టమ్ 2.0 ఫీచర్‌ను జోడించింది.

అయితే ఈ కొత్త బైక్స్‌ వివిధ రంగులలో అందుబాటులో ఉన్నాయి. ఈ బైక్స్‌ను సొంతం చేసుకున్న కస్టమర్లకు బీఎండబ్ల్యూ పలు ఆఫర్లు కూడా ఇస్తోంది. అన్‌ లిమిటెడ్‌ కిలీమీటర్లు, 3 సంవత్సరాల పాటు ప్రామాణిక వారంటీ, రోడ్ సైడ్ అసిస్టెన్స్, 24×7 365 రోజుల బ్రేక్‌డౌన్ ప్యాకేజీ లాంటివి ప్రకటించింది.