Bluetooth Helmet: మార్కెట్ లోకి సరికొత్త బ్లూటూత్ హెల్మెట్.. ధర ఫీచర్స్ ఇవే?

మనం ఎప్పుడైన మనం బైకులో వెళ్తున్నప్పుడు వెనుక కూర్చున్న వ్యక్తితో మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. అయితే

  • Written By:
  • Publish Date - January 26, 2023 / 07:30 AM IST

మనం ఎప్పుడైన బైకులో వెళ్తున్నప్పుడు వెనుక కూర్చున్న వ్యక్తితో మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. అయితే కొన్ని కొన్ని సార్లు గాలి శబ్దం వల్ల మనం మాట్లాడే మాటలు వెనుక వ్యక్తికి వెనుక వ్యక్తి మాట్లాడే మాటలు మనకు సరిగా వినిపించవు. తల వెనక్కి తిరిగి మాట్లాడాలి అంటే రోడ్డు ప్రమాదాలు జరుగుతాయేమో అని భయపడుతూ ఉంటారు. అయితే ఇకపై ఇలాంటి ఇబ్బందులు అవసరం లేదు. వాటి అవసరం లేకుండా ఉండటం కోసం మార్కెట్లోకి కొన్ని హెల్మెట్లు వచ్చాయి. ఆ హెల్మెట్ ద్వారా మీ బైక్ లో వెనుక వైపు కూర్చున్న వ్యక్తితో కూడా మీరు ఈజీగా మాట్లాడవచ్చు.

అదేలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కాగా సాధారణంగా ఆఫీస్ లలో ఇంటర్‌కామ్ ఎలా అయితే పనిచేస్తుందో అదే విధంగా ఈ హెల్మెట్ పనిచేస్తుంది. ఈ హెల్మెట్ లోపల, చెవి దగ్గర రెండు చిన్న స్పీకర్లను నోటి దగ్గర ఒక చిన్న మైక్ ఉంటాయి. అలాంటి రెండు హెల్మెట్‌లు బ్లూటూత్ ద్వారా ఒకదానికొకటి కనెక్ట్ చేయబడితే, ఇద్దరూ ఇంటర్‌కామ్ లాగా ఒకరితో ఒకరు ఈజీగా మాట్లాడుకోవచ్చు. అయితే కొన్నిసార్లు మనం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఎవరైనా ఫోన్ కాల్ చేసినా కూడా సరిగ్గా రెస్పాండ్ అవ్వలేక పోతాము. కానీ ఈ హెల్మెట్ ధరించడం వల్ల కాల్ మిస్ అవ్వకుండా మాట్లాడవచ్చు. ఏదైనా ఫోన్ వచ్చినప్పుడు వెంటనే మీరు బ్లూటూత్ ద్వారా ఫోన్ మాట్లాడుకోవచ్చు. కేవలం ఫోన్ కాల్స్ మాత్రమే కాకుండా ఆ బ్లూటూత్ హెల్మెట్ ని మీ మొబైల్ ఫోన్ కనెక్ట్ చేసుకుని సాంగ్స్ కూడా వినవచ్చు.

ఈ బ్లూటూత్ హెల్మెట్ కారణంగా వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తితో ఈజీగా మాట్లాడవచ్చు. లాంగ్ డ్రైవ్ వెళ్లాలి అనుకున్నవారికి ఈ హెల్మెట్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే గ్రూపు బైకింగ్ ఇష్టపడే వారికి కూడా ఈ హెల్మెట్ బాగా ఉపయోగపడుతుంది. ఎలా అంటే ఒకేసారి ఆరుగురు వ్యక్తులు ఈ బ్లూటూత్ హెల్మెట్ ని కనెక్ట్ చేసుకోవచ్చు. అయితే ఈ బ్లూటూత్ పరిధి 800 నుండి 1200 మీటర్ల వరకు కనెక్ట్ అవుతుంది. ఇకపోతే ఈ హెల్మెట్ బ్లూటూత్ విషయానికి వస్తే..
బొగోట్టో కంపెనీకి చెందిన ఈ హెల్మెట్ ధర రూ.14800 గా ఉంది. అయితే ఈ హెల్మెట్ ని కొనుగోలు చేయలేని మీ సాధారణ హెల్మెట్ కోసం బ్లూటూత్ ఇంటర్‌కామ్ పరికరాన్ని కూడా తీసుకోవచ్చు. దాని ధర రూ.2500 నుంచి మొదలవుతుంది.