Site icon HashtagU Telugu

Music Cap: ఇయర్ బడ్స్, బ్లూటూత్ కి గుడ్ బై చెప్పేయండి.. తక్కువ ధరకే మ్యూజిక్ క్యాప్స్?

Music Cap

Music Cap

సాధారణంగా చాలామంది సంగీతాన్ని ఎక్కువగా వినడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇందుకోసం ఎక్కువగా ఇయిర్ బర్డ్స్, బ్లూటూత్ లాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగిస్తూ ఉంటారు. అయితే చలికాలంలో ఇయర్ బర్డ్స్ లాంటివి ఉపయోగించినప్పుడు వాటిపై నుంచి వింటర్ క్యాప్ పెట్టుకోవడం కాస్త కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ విషయాన్ని గుర్తించిన మార్కెట్ వర్గాలు సరికొత్తగా ఆలోచించాయి. వాస్తవానికి, మీరు వెచ్చని క్యాప్‌లతో ఇయర్‌బడ్‌లను ధరించలేరు ఎందుకంటే అవి మీ చెవుల్లోకి ఒత్తుకుపోయినట్లుగా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటాయి. దీని కారణంగా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు.

దీంతో కొందరు మార్కెట్ వర్గాలు ఇప్పుడు వింటర్ క్యాప్‌తోపాటు ఈ గాజెట్‌లను రెడీ చేశారు. జస్ట్ ఈ క్యాప్స్ పెట్టుకుంటే చాలు మ్యూజిక్ వింటూ హాయిగా ఎక్కడికైన వెళ్లవచ్చు.. ఇప్పుడు మనం తెలుసుకోబోతున్న క్యాప్ పేరు బ్లూటూత్ ఫ్యాషన్ క్యాప్. ఈ క్యాప్స్ ఇప్పుడు వినియోగదారుల కోసం మార్కెట్‌లో హాట్ కేక్స్‌లా అమ్ముడవుతున్నాయి. అన్ని ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్‌లో ఇవి దొరుకుతున్నాయి. వీటి ధర సూమారు రూ. 3499 వరకు ఉన్నాయి. అయితే ఇయిర్ ఎండింగ్ ఆఫర్ల పేరుతో 77 శాతం భారీ తగ్గింపుతో వీటిని విక్రయిస్తున్నారు. అయితే ఇవి రూ. 380 లకే అందుబాటు ధరలో లభిస్తున్నాయి. ఈ టోపీ వింటర్ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడింది.

అయితే ఇది కేవలం క్యాప్ మాత్రమే కాకుండా అందులో చాలా ప్రత్యేక సాంకేతికతను కూడా ఉపయోగించారు. ఈ క్యాప్‌లో కంట్రోల్ ప్యానెల్ ఇన్‌స్టాల్ చేయబడింది. అలాగే అద్భుతమైన స్పీకర్లు ఇందులో అందుబాటులో ఉన్నాయి. ఇవి సంగీతాన్ని వినడానికి ఉపయోగపడతాయి. ఈ నియంత్రణలు ఒక వైపు ఉంచబడ్డాయి, తద్వారా వినియోగదారులు సులభంగా వాల్యూమ్‌ను నియంత్రించవచ్చు అలాగే బ్లూటూత్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయవచ్చు. చాలామంది మ్యూజిక్ ప్రియులతో పాటు సాధారణ వ్యక్తులు కూడా వీటిని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు.