Site icon HashtagU Telugu

Bike Tank: మీ బైక్ పెట్రోల్ ట్యాంక్ లోకి నీరు చేరిందా.. వెంటనే ఇలా చేయండి!

Bike Tank

Bike Tank

మామూలుగా వర్షాకాలంలో, వాటర్ సర్వీసింగ్ చేయించినప్పుడు అలాగే ఇతర కొన్ని కొన్ని సందర్భాలలో మన బైక్ పెట్రోల్ ట్యాంక్ లోకి నీరు పోవడం అన్నది సహజం. మరి ముఖ్యంగా వర్షాకాలంలో మనం బైకులను బయట ఎక్కువగా పార్కింగ్ చేయడం వల్ల ఈ సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇంజిన్‌ లోకీ నీరు వెళ్లినా, పెట్రోల్‌ ట్యాంక్‌ లోకి వెళ్లినా, అలాగే ప్లగ్‌ లోకి వెళ్లినా సమస్య తలెత్తుతుంటుంది. అలాంటి సమయంలో బైక్‌ ఎంతకీ స్టార్ట్‌ కాదు. వర్షం సమయంలో మీ బైక్ ట్యాంక్‌ లోకి నీరు చేరినట్లయితే, అది కొన్ని సమస్యలను ఎదుర్కొవాల్సి వస్తుంటుంది.

ట్యాంక్‌ లోని నీరు ఇంజిన్ పనితీరునుపై ప్రభావితం చేస్తుంది. అలాగే బైక్ స్టార్ట్ కాకుండా చేస్తుంది. ఇక్కడ కొన్ని సమస్యలు, వాటి పరిష్కారాలు ఉన్నాయి. అవి ఏంటి అన్న విషయానికొస్తే. నీరు, పెట్రోల్‌ మిశ్రమం ఇంజిన్‌ను సరిగ్గా మండించదు. దాని కారణంగా బైక్ స్టార్ట్ కాదు. ట్యాంక్‌లో నీరు ఉంటే నడుస్తున్నప్పుడు ఇంజిన్ ఆగిపోవచ్చు. అలాగే ఫ్యూయల్ లైన్‌లో నీరు చేరితే అది ఇంజన్‌కు చేరి ఇంజన్ దెబ్బతింటుంది. బైక్ ట్యాంక్‌లోకి నీరు చేరితే ఏం చేయాలి? అన్న విషయానికి వస్తే.. ముందుగా బైక్‌లోని ఇంధన ట్యాంక్‌ను పూర్తిగా ఖాళీ చేయాలి.

మీ బైక్‌లో ఫ్యూయల్ ఫిల్టర్ ఉంటే, దాన్ని కూడా చెక్ చేయాలి. అవసరమైతే దాన్ని భర్తీ చేయాలి. పొడి గుడ్డ లేదా ఎయిర్ బ్లోవర్‌ తో ట్యాంక్‌ ను తుడిచి బాగా ఆరబెట్టాలి. లోపల తేమ లేకుండా చూసుకోవాలి. ట్యాంక్ పూర్తిగా ఎండిపోయిందని మీరు నిర్ధారించుకున్నప్పుడు, మీరు ట్యాంకు నుంచి తీసిన పెట్రోల్‌ కాకుండా తాజా పెట్రోల్‌ను వేయాలి. ఇలా చేసినా కూడా సమస్య అలాగే కొనసాగితే బైక్ ను సర్వీస్ సెంటర్ కు తీసుకెళ్లడం మంచిది.