Whatsapp: బిగ్ అప్డేట్.. ఇకపై గ్రూప్స్ అన్నీ ఒకేచోటికి.. ఎలా అంటే?

ప్రస్తుత రోజుల్లో ఆధార్ కార్డు అన్నది ముఖ్యమైన డాక్యుమెంట్లలో ఒకటిగా మారిపోయింది. దీంతో ప్రతి ఒక్క డాక్యుమెంట్

  • Written By:
  • Updated On - November 4, 2022 / 04:45 PM IST

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గురించి మనందరికీ తెలిసిందే. నిత్యం కోట్లాదిమంది వినియోగదారులు ఈ వాట్సాప్ ను వినియోగిస్తూనే ఉంటారు. ఇకపోతే వాట్సాప్ వినియోగదారులు వాట్సాప్ లో కమ్యూనిటీస్ ఫీచర్ కోసం ఎప్పటినుంచే ఎదురుచూస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఎట్టకేలకు ఈ వాట్సాప్ నుంచి కమ్యూనిటీస్ అనే ఫీచర్ మొదలయ్యింది. వాట్సాప్ కమ్యూనిటీస్ ను లాంచ్ చేయబోతున్నట్టు వాట్సాప్ మాతృ సంస్థ అయిన మెటా తాజాగా ప్రకటించింది. కమ్యూనిటీస్ తో పాటుగా ఇన్ ఛాట్ పోల్స్, 32 పర్సన్ వీడియో కాలింగ్, 1024 యూజర్లతో గ్రూప్స్ ఇలా మంచి మంచి ఫీచర్ ని కూడా రిలీజ్ చేసింది వాట్సాప్.

వాట్సాప్ యూజర్లు వాట్సాప్ కమ్యూనిటీస్ ఈరోజు సాయంత్రం నుంచి ప్రపంచవ్యాప్తంగా యూజర్లకు అందుబాటులోకి రోల్ అవుట్ చేస్తామని మెటా సీఈఓ మార్క్ జుకర్‌ బర్గ్ ప్రకటించారు. కాగా ఈ ఫీచర్ కొన్ని నెల ల్లోనే వినియోగదారులందరికీ కూడా అందుబాటులోకి రానుంది. కాగా వాట్సాప్ అందిస్తున్న అతి పెద్ద అప్డేట్స్ లో కమ్యూనిటీస్ స్పీకర్ కూడా ఒకటి. ఈ కమ్యూనిటీస్ ఫ్యూచర్ వేరు వేరు వాట్సాప్ గ్రూప్స్ ని వాట్సాప్ లో ఒకే చోట కనెక్ట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. స్కూల్స్‌లో పేరెంట్స్, ఉద్యోగులకు, కాలేజీ స్టూడెంట్స్ ఉండే వేర్వేరు గ్రూప్స్‌ని ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చేందుకు ఈ కమ్యూనిటీస్ ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది.

కాలేజి, ఆఫీసులో ఉన్న వేర్వేరు వాట్సప్ గ్రూప్స్‌ని కమ్యూనిటీస్‌ ఫీచర్ ద్వారా ఒకే సెక్షన్‌లోకి తీసుకురావొచ్చు. కమ్యూనిటీస్‌లో ఓ 10 గ్రూప్స్‌ని చేర్చాలనుకుంటే అందులో ఒక గ్రూప్ సభ్యులకు మాత్రమే ఏదైనా మెసేజ్ చేయాలంటే ఆ ఒక్క గ్రూప్ సెలెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. అడ్మిన్స్ మాత్రమే కమ్యూనిటీస్ క్రియేట్ చేయవచ్చు. కొత్త గ్రూప్‌లను ఏర్పాటు చేయడం ద్వారా లేదా ముందుగా ఉన్న గ్రూపులను లింక్ చేయడం ద్వారా అడ్మిన్‌లు తమ కమ్యూనిటీలో భాగమయ్యే గ్రూప్స్‌ని సెలెక్ట్ చేయొచ్చు.