Site icon HashtagU Telugu

Tariff Rates Increase: మొబైల్ వినియోగ‌దారుల‌కు బిగ్ షాక్‌.. టారిఫ్ రేట్ల పెంపు ఎప్పుడంటే..?

Airtel

Airtel

Tariff Rates Increase: టెలికాం కంపెనీలు వివిధ మొబైల్ సర్వీస్ ప్లాన్‌ల టారిఫ్‌లను (Tariff Rates Increase) పెంచబోతున్నాయి. ఓ నివేదిక ప్రకారం.. ఈ సంవత్సరం మొబైల్ సర్వీస్ టారిఫ్‌లను 15-17% పెంచవచ్చని పేర్కొంది. అదే సమయంలో జియో, ఎయిర్‌టెల్‌ తమ ప్రీమియం వినియోగదారులకు అపరిమిత డేటాను అందించడాన్ని నిలిపివేయవచ్చని ఆ నివేదిక తెలుపుతుంది. జూన్-జూలై నాటికి కంపెనీలు టారిఫ్‌ల పెంపుపై నిర్ణయం తీసుకోవచ్చు. మరికొందరు నిపుణులు మొబైల్ ఫోన్ సేవలు 20% ఖరీదైనవిగా మారుతాయని భావిస్తున్నారు. అదే సమయంలో 4Gతో పోలిస్తే 5G సేవ కోసం 5-10% ఎక్కువ ఛార్జీలు వసూలు చేయవచ్చని చెబుతున్నారు.

కంపెనీలు 2-3 వాయిదాలలో టారిఫ్‌లను పెంచవచ్చు

మార్కెట్ వాటా పరంగా దేశంలోని రెండవ అతిపెద్ద టెలికాం కంపెనీ అయిన భారతి ఎయిర్‌టెల్.. మూడేళ్లలో ‘రివిన్యూ పర్ యూజర్’ (RPU) అంటే ఒక్కో వినియోగదారుడి సగటు సంపాదనను రూ.208 నుండి రూ.286కి పెంచాలనుకుంటోంది. ఇందుకోసం కంపెనీ దాదాపు రూ.55 టారిఫ్‌ను పెంచవచ్చు. ఈ ఏడాది జియో తన టారిఫ్‌లను సగటున 15% పెంచవచ్చు.

పెట్టుబడిపై తక్కువ రాబడిని భర్తీ చేసే ప్రయత్నం

బ్యాంక్ ఆఫ్ అమెరికా ప్రకారం.. భారతీయ టెలికాం కంపెనీలు 5G స్పెక్ట్రమ్ కోసం భారీ మొత్తాన్ని ఖర్చు చేశాయి. ROCE (రిటర్న్ ఆఫ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్) అంటే ఖర్చులకు అనులోమానుపాతంలో ఆదాయాలు చాలా తక్కువగా ఉన్నాయి. అపరిమిత ప్లాన్‌ల కారణంగా కంపెనీల ఆదాయం ఇప్పటి వరకు తక్కువగానే ఉంది.

Also Read: Gas Based Power Plants: సమ్మర్ కారణంగా దేశంలో గ్యాస్ విద్యుత్ ప్లాంట్లు

నవంబర్ 2021లో టారిఫ్ ప్లాన్‌లు ఖరీదైనవిగా మారాయి

మొబైల్ టారిఫ్‌లలో చివరి పెరుగుదల నవంబర్, 2021లో జరిగింది. ఆ సమయంలో వోడాఫోన్ ఐడియా సుమారు 20%, భారతీ ఎయిర్‌టెల్, జియో 25% టారిఫ్‌లను పెంచాయి. Cable.co.uk నివేదిక ప్రకారం..భారతీయులు 1GB డేటా కోసం సగటున 13.34 రూపాయలు చెల్లించాల్సి రావొచ్చ‌ని పేర్కొంది.

We’re now on WhatsApp : Click to Join

ప్రస్తుతం దేశంలో 116 కోట్లకు పైగా మొబైల్ సబ్‌స్క్రైబర్లు ఉన్నారు

భారతదేశంలో టెలికాం కంపెనీల ఖాతాలను ఉంచే సంస్థ అయిన టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) ఫిబ్రవరి 2024 డేటా ప్రకారం.. జనవరి 2024తో పోలిస్తే ఫిబ్రవరిలో దేశవ్యాప్తంగా 39,30,625 మంది మొబైల్ చందాదారులు పెరిగారు. జనవరిలో దేశవ్యాప్తంగా 116.07 కోట్ల మంది మొబైల్ వినియోగదారులు ఉండగా, ఫిబ్రవరిలో వారి సంఖ్య 116.46 కోట్లకు పెరిగింది.