Amazon Sale: శాంసంగ్ చీపెస్ట్ 5జి స్మార్ట్ ఫోన్.. కార్డు ఆఫర్ తో అతి తక్కువ ధరకే?

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5జీ ఫీవర్ నడుస్తోంది. దీంతో వినియోగదారులు 5జీ స్మార్ట్ ఫోన్ లను కొనడానికి ఆసక్తిని

Published By: HashtagU Telugu Desk
Samsung Galaxy M13 5g

Samsung Galaxy M13 5g

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5జీ ఫీవర్ నడుస్తోంది. దీంతో వినియోగదారులు 5జీ స్మార్ట్ ఫోన్ లను కొనడానికి ఆసక్తిని కనబరుస్తున్నారు. ఈ క్రమంలోనే వినియోగదారులు బడ్జెట్ రేంజ్ లో 5జీ మొబైల్ కోసం ఎదురుచూస్తుండగా శాంసంగ్ తక్కువ ధరలో 5జి స్మార్ట్ ఫోన్ కావాలి అనుకున్నవారికి తాజాగా ఒక ఆప్షన్ ను అందుబాటులోకీ తెచ్చింది. అదేమిటంటే శాంసంగ్ గెలాక్సీ ఎం 13 5జీ. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ డేస్ సందర్భంగా ఈ శాంసంగ్ గెలాక్సీ మొబైల్ తక్కువ ధరకే లభిస్తోంది.

ఈ స్మార్ట్ ఫోన్ ని బ్యాంక్ కార్డ్ ఆఫర్ ను ఉపయోగించుకుంటే మరింత తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్ ని దక్కించుకోవచ్చు. అమెజాన్ సేల్ లో శాంసంగ్ గెలాక్సీ ఎం 31 5జీ ధర ఆఫర్ల విషయానికొస్తే..శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్ ఫోన్ ధర ప్రస్తుతం అమెజాన్ సేల్ లో రూ.11,999 గా ఉంది. అయితే మామూలుగా 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉండే ఈ ఫోన్ ధర రూ.13,999 కాగా తగ్గింపు ధరితో తక్కువ ధరకే 11, 999కీ లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ ని కొనుగోలు చేయడానికి యాక్సిస్,ఐసిఐసిఐ,సిటీ బ్యాంకుల క్రెడిట్ డెబిట్ కార్డు తో కొంటే అదనంగా రూ.1200 వరకు అదనపు తగ్గింపును పొందవచ్చు.

ఇందులోనే శాంసంగ్ గెలాక్సీ ఎం 13 5 జీ, 6 జీబీ ర్యామ్,128 జీబీ స్టోరేజ్ వేరియంట్ పై కూడా డిస్కౌంట్ లు,కార్డులు ఆఫర్లు ఉన్నాయి. 90Hz రిఫ్రెష్ రేట్ ఉండే 6.5 ఇంచుల హెచ్‌డీ డిస్‌ప్లే తో శాంసంగ్ గెలాక్సీ ఎం13 5జీ వస్తోంది. ఆండ్రాయిడ్‌ 12 బేస్డ్ వన్ యూఐ 4 ఓఎస్‌తో ఈ ఫోన్ వస్తోంది. శాంసంగ్ గెలాక్సీ ఎం13 5జీ స్మార్ట్ ఫోన్ వెనుక వైపు రెండు కెమెరాలు ఉన్నాయి. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ, 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరాలు ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో వస్తోంది. 5000mAh బ్యాటరీ ఈ ఫోన్‌లో ఉంటుంది.

  Last Updated: 15 Oct 2022, 05:11 PM IST