Site icon HashtagU Telugu

Smartphones: భారీ బ్యాటరీతో ఆకట్టుకుంటున్న అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ లు ఇవే!

Smartphones

Smartphones

ప్రస్తుతం మార్కెట్ లో ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. వీటిలో తక్కువ బ్యాటరీ నుంచి అత్యధిక బ్యాటరీ కలిగిన స్మార్ట్ ఫోన్లు చాలానే ఉన్నాయి. అయితే స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఎక్కువ శాతం మంది భారీ బ్యాటరీ కలిగిన ఫోన్ పైన ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం మార్కెట్లో ఉన్న భారీ బ్యాటరీలు కలిగిన స్మార్ట్ ఫోన్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. 7000mAh బ్యాటరీ కలిగిన్ స్మార్ట్‌ఫోన్‌ లపై ఒక లుక్ వేద్దాం..

శామ్‌సంగ్ గెలాక్సీ M51 స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే..ఇది శక్తివంతమైన బ్యాటరీ, మంచి కెమెరా సెటప్ కలిగిన స్మార్ట్‌ ఫోన్ అని చెప్పాలి. 6.7 అంగుళాల కలిగిన సూపర్ AMOLED డిస్ప్లే తో రానుంది. అలాగే స్నాప్‌డ్రాగన్ 730జీ ప్రాసెసర్ తో రానుంది. ఈ ఫోన్ స్టోరేజ్ విషయానికి వస్తే.. 8జీబీ ర్యామ్,28జీబీ స్టోరేజీతో రానుంది. అలాగే 64 ఎంపీ క్వాడ్ రియర్ కెమెరాను కలిగి ఉండనుంది. 7000mAh ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో రానుంది.

ఐటెల్ P40 ప్లస్.. ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ శక్తివంతమైన బ్యాటరీ, మంచి ఫీచర్స్‌ తో వస్తుంది. డిస్‌ప్లే HD+ IPS | 90Hz రిఫ్రెష్ రేట్ తో రానుంది. యూనిసాక్ T606 ప్రాసెసర్ ను కలిగి ఉండనుంది. స్టోరేజ్ విషయానికి వస్తే.. 4జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్ ను కలిగి ఉండనుంది. 13ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా, 8ఎంపీ ఫ్రెంట్ కెమెరాతో రానుంది. అలాగే ఈ ఫోన్ కూడా 7000mAh భారీ బ్యాటరీ ని కలిగి ఉంది. ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది.

శామ్‌సంగ్ గెలాక్సీ ఎఫ్ 62.. ఈ స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన డిస్‌ప్లే, అద్భుతమైన పనితీరుతో వస్తుంది. 6.7 అంగుళాల సూపర్ AMOLED+ రానుంది. 6జీబీ /8జీబీ రామ్ | 128జీబీ స్టోరేజీ తో రానుంది. 64ఎంపీ క్వాడ్ కెమెరాను కలిగి ఉండనుంది. 7000mAh ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కి సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు చెప్పిన స్మార్ట్ ఫోన్లు భారీ బ్యాటరీ కలిగి ఉండడంతో పాటు ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తాయి