Best Laptops: మీరు రూ. 30,000 బడ్జెట్‌లో మంచి పనితీరు, ఫీచర్లతో కూడిన ల్యాప్‌టాప్ (Best Laptops) కోసం చూస్తున్నారా? అయితే మార్కెట్లో అందుబాటులో ఉన్న కొన్ని అద్భుతమైన ఎంపికలను టెక్ నిపుణులు సూచిస్తున్నారు. ఈ ల్యాప్‌టాప్‌లు రోజువారీ సాధారణ పనులతో పాటు కొంత క్యాజువల్ గేమింగ్ కోసం కూడా అత్యుత్తమ పనితీరును అందించగలవు. ఈ జాబితాలో హెచ్‌పీ (HP) నుండి ఎంఎస్‌ఐ (MSI) వరకు పలు ప్రముఖ బ్రాండ్‌ల ల్యాప్‌టాప్‌లు ఉన్నాయి.
ఈ జాబితాలో ఉన్న ప్రధాన ల్యాప్‌టాప్‌లు
ASUS Vivobook Go 15 (AMD Ryzen 3): ఆసుస్ వివోబుక్ గో 15 మోడల్ AMD Ryzen 3 Quad Core 7320U ప్రాసెసర్‌తో వస్తుంది. ఇందులో 8 GB RAM, 512 GB SSD స్టోరేజ్ ఉన్నాయి. లేటెస్ట్ Windows 11 Home ఆపరేటింగ్ సిస్టమ్‌తో లభించే ఈ ల్యాప్‌టాప్ ధర ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 29,990గా ఉంది.
Infinix X3 Slim (Intel Core i3 12th Gen): ఇన్‌ఫినిక్స్ కంపెనీ నుంచి వచ్చిన X3 స్లిమ్ మోడల్ పవర్ ఫుల్ Intel Core i3 12th Gen 1215U ప్రాసెసర్‌తో ఆకట్టుకుంటోంది. 8 GB RAM, 512 GB SSD స్టోరేజ్‌తో పాటు Windows 11 Home కలిగి ఉన్న ఈ ల్యాప్‌టాప్ ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ. 27,990కే అందుబాటులో ఉంది.
Also Read: Parliament Winter Session: పార్లమెంట్ శీతాకాల సమావేశాల షెడ్యూల్ ఖరారు!
MSI (Intel Core i3 12th Gen): ఎంఎస్‌ఐ బ్రాండ్ నుంచి అదే Intel Core i3 12th Gen 1215U ప్రాసెసర్‌తో వచ్చిన ఈ ల్యాప్‌టాప్.. 8 GB RAM, 512 GB SSD ఫీచర్లతో లభిస్తోంది. దీని ధర ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 27,990గా నిర్ణయించారు.
Lenovo V15 (AMD Ryzen 3 7th Gen): పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ కోసం చూసేవారికి లెనోవో V15 మంచి ఎంపిక. AMD Ryzen 3 Quad Core 7th Gen 7320U ప్రాసెసర్‌తో పాటు ఇది అదనంగా 1 GB గ్రాఫిక్స్ కార్డును కూడా అందిస్తోంది. 8 GB RAM, 512 GB SSDతో కూడిన ఈ ల్యాప్‌టాప్ ధర ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 27,990గా ఉంది.
HP 15 (2024) (AMD Ryzen 3 7320U): ఈ జాబితాలోని చివరి మోడల్ HP నుంచి వచ్చింది. AMD Ryzen 3 Quad Core 7320U ప్రాసెసర్, 8 GB RAM, 512 GB SSDతో వచ్చిన ఈ ల్యాప్‌టాప్.. Windows 11 Home సపోర్ట్‌తో ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 29,990కి లభిస్తోంది.
