Best 5G Phones: తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్ లతో ఆకట్టుకుంటున్న బెస్ట్ 5జీ ఫోన్స్ ఇవే?

ప్రస్తుతం మార్కెట్ లో 5జీ నెట్ వర్క్ నడుస్తోంది. దాంతో ప్రతీ ఒక్కరు కూడా 5జీ మారాలి అనుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ఎక్కువ శాతం మంది 5జీ మొబై

  • Written By:
  • Publish Date - June 16, 2024 / 01:44 PM IST

ప్రస్తుతం మార్కెట్ లో 5జీ నెట్ వర్క్ నడుస్తోంది. దాంతో ప్రతీ ఒక్కరు కూడా 5జీ మారాలి అనుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ఎక్కువ శాతం మంది 5జీ మొబైల్స్ ని వినియోగించాలి అనుకుంటున్నారు. కానీ చాలా మంdది వాటి ధరల కారణంగా వెనకడుగు వేస్తున్నారు. మీరు కూడా 5జీ ఫోన్ ని కొనుగోలు చేయాలనుకుంటున్నారా. అయితే మీకు గుడ్ న్యూస్. మార్కెట్ లో తక్కువ బడ్జెట్ లో 5 జీ ఫోన్లు అమెజాన్ లో అందుబాటులో ఉన్నాయి. కేవలం రూ.15 వేలలోపు ధరలో దొరుకుతున్నాయి.

మీరు ఎలాంటి ఇబ్బంది లేకుండా 4 జీ నుంచి 5జీ నెట్‌వర్క్‌కు మారిపోవచ్చు. ఇంతకీ ఆ ఫోన్ లు ఏవి అన్న విషయానికి వస్తే.. రియల్ మీ నార్జో 60ఎక్స్ 5జీ.. 6.72 అంగుళాల స్క్రీన్, మీడియా టెక్ డైమెన్సిటీ 6100 ప్లస్ ప్రాసెసర్ తో పనితీరు బాగుంటుంది. ముందు 8 ఎంపీ, వెనుక 50 ఎంపీ ఏఐ కెమెరాలు ఉన్నాయి. ఆండ్రాయిడ్ 13.0 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేస్తుంది. 5 జీబీ ర్యామ్, 128 జీబీ మెమరీ కెపాసిటీ దీని ప్రత్యేకత. దీనిలోని 5000 ఎంఏహెచ్ బ్యాటరీని 33W సూపర్వూక్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో 30 నిమిషాల్లో 50 శాతం, 70 నిమిషాల్లో వందశాతం చార్జింగ్ చేసుకోవచ్చు. 28 వేల కంటే ఎక్కువ ఫొటోలు, లేదా 450 టీవీ షో ఎపిసోడ్‌లను స్టోర్ చేయవచ్చు.

ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ ధర విషయానికి వస్తే.. ఈ ఫోన్ ధర రూ.14,499 గా ఉంది. అలాగే తక్కువ ధరకే లభిస్తున్న మరో స్మార్ట్ ఫోన్ సామ్సంగ్ గెలాక్సీ ఎం34 5జీ. ఇందులో 6.5 అంగుళాల ఎఫ్ హెచ్ డీ+ సూపర్ అమోలెడ్ డిస్ ప్లే ఉంది. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌, ఆక్టా కోర్ ప్రాసెసర్‌ తో పనిచేస్తుంది. 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 50 ఎంపీ+8 ఎంపీ+2 ఎంపీ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఫ్రంట్ 13 ఎంపీ కెమెరా ఏర్పాటు చేశారు. దీనిలోని 6000 ఎంఏహెచ్ బ్యాటరీ కారణంగా బ్యాకప్ తో రానుంది. ఈ ఫోన్ ధర రూ.12,999 గా ఉందీ.

ఇదే జాబితాలో ఉన్న మరో స్మార్ట్ ఫోన్ రియల్ మీ.. ఈ ఫోన్ లో 6.79 అంగుళాల స్క్రీన్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ కేపాసిటీ ఉన్నాయి. ఆండ్రాయిడ్ 13 ఆధారంగా, స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ఎంఐయూఐ 14 ప్రాసెసర్ తో పనిచేస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 తో డిస్ ప్లేకు రక్షణ లభిస్తుంది. విభిన్న మోడ్‌లతో కూడిన 50 ఎంపీ ఏఐ డ్యూయల్ కెమెరాతో పాటు సెల్ఫీల కోసం 8 ఎంపీ కెమెరా ఉంది. 22.5 W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, డస్ట్/వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్ దీనికి అదనపు ప్రత్యేకత. ఈ ఫోన్ ధర రూ.12,499కే కొనుగోలు చేయవచ్చు. కేవలం ఈ స్మార్ట్ ఫోన్లు మాత్రమే కాకుండా రియల్ మీ నార్జో 70ఎక్స్ 5జీ, రెడ్ మీ 12సీ 5జీ వంటి స్మార్ట్ ఫోన్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.