Site icon HashtagU Telugu

Driverless Taxi: ఎలాన్ మస్క్ ఎక్కడున్నవ్..డ్రైవర్ లెస్ టాక్సీ సర్వీసులు చైనాలో షురూ..!!

Baidu Apollo Driverless Vehicles Imresizer

Baidu Apollo Driverless Vehicles Imresizer

తాను అనుకున్న పంతాన్ని నెగ్గించుకున్నాడు. చిటికలెస్తూ…ట్విట్టర్ ను కొనుగోలు చేశారు ఎలాన్ మస్క్. అయినప్పటికీ ఓ కోరిక అలాగే ఉండిపోయింది. టెస్లా కార్లలో ఆటో పైలెట్ కి అనుమతి సాధించేందుకు ఏళ్ల తరబడి ఎలాన్ మస్క్ ప్రయత్నిస్తున్నాడు. కానీ తాను అనుకున్న ఫలితాన్ని పొందలేకపోయాడు. మరోవైపు చైనా చాప కింద నీరులా ఈ పని కానిచ్చేసింది.

ప్రపంచంలోనే తొలిసారిగా సెల్ఫ్ డ్రైవింగ్ ట్యాక్సీ సేవలు చైనాలో ప్రారంభం కానున్నాయి. క్వాంజో నగరంలోని నన్షా ప్రాంతంలో వంద రోబోట్యాక్సీలు నడిపేందుకు టయోటా ప్రమోట్ చేస్తున్న పోనీ.ఏఐ అనే కంపెనీ ఈ మేరకు లైసెన్స్ ను దక్కించుకుంది. బీజింగ్ నగరంలోనూ సేవలు ఆఫర్ చేసేందుకు పోనీ.ఏఐతోపాటు ఇంటర్నెట్ దిగ్జం బైడూ లైసెన్సును పొందింది. బీజింగ్ లో 67అటానమస్ వెహికల్స్ టెస్టు కోసం పోనీ.ఏఐ 2021నవంబర్ లో ఆమోదం పొందింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి 7,00,000ట్రిప్స్ పూర్తి చేసుకుంది. 80శాతం రైడర్స్ పాత వినియోగదారులేనని కంపెనీ వెల్లడించింది.

క్వాంజో నగరంలోని ఇతర ప్రాంతాలతోపాటు చైనాలోని ఫస్ట్ క్లాస్ నగరాల్లోనూ రోబోట్యాక్సీ సర్వీసులను వచ్చే ఏడాది నుంచి షూరు చేయాలని కంపెనీ భావిస్తోంది. అయితే ప్రస్తుతానికి ఈ అటానమస్ వాహనంలో డ్రైవర్ కూడా ఉండనున్నారు. ఈ రెండు కంపెనీలూ రానున్న రోజుల్లో డ్రైవర్ లేకుండానే సేవలు అందిస్తాయని తెలిపింది. కాలిఫోర్నియాకు చెందిన ఫోనీ.ఏఐ కంపెనీని జేమ్స్ హంగ్, టించెంగ్ లూహ్ 2016వ సంవత్సరంలో స్థాపించారు.

 

Exit mobile version