APPLE: బాబోయ్.. ఈ కంప్యూటర్ మౌస్ రేటు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

ప్రపంచంలో ఎక్కువ మంది లవ్ చేసే మెుబైల్ ఏదైనా ఉందంటే ఆపిల్.

  • Written By:
  • Publish Date - March 21, 2023 / 10:11 PM IST

APPLE: ప్రపంచంలో ఎక్కువ మంది లవ్ చేసే మెుబైల్ ఏదైనా ఉందంటే ఆపిల్. ఏడాది ఒక మోడల్ తెచ్చినా, అందులో ఉండే ఫీచర్లు ఆ రేంజ్ లోనే ఉంటాయి. బాహుబలి సినిమా కోసం సినీప్రియలు ఏ విధంగా ఎదురు చూశారో, అలానే యాపిల్ ఫోన్ల కోసం ఈ జనం ఎదురు చూస్తారు. ఇక యాపిల్ కంపెనీకి చెందిన ఏ వస్తువైనా ధరైనా ఆకాశాన్ని అంటుతుంది. తాజాగా ఈ కంపెనీ మౌస్ ను మార్కెట్ లోకి తెచ్చింది. దీని ధర చూసి కస్టమర్లు కంగు తిన్నారు.

స్టీవ్‌ జాబ్స్‌ కే ప్రేరణగా నిలిచిన కంప్యూ టర్ మౌస్ 1,47,000 పౌండ్లకు అంటే 1,48,89,174 అమ్ముడైంది.కంప్యూటింగ్ ఐకాన్ డగ్లస్ ఎం గెల్‌బార్ట్ రూపొందించారు. ఈ అరుదైన తొలి త్రి-బటన్ కంప్యూటర్ మౌస్ కు, రెండు మెటల్ డిస్క్‌ లను వినియోగిస్తుంది.కోడింగ్ కీసెట్‌లోని ఐదు కీలను ఉపయోగించి మొత్తం 31 వేర్వేరు కీ ప్రెస్‌లను తయారు చేయవచ్చు.ఈ సెటప్‌ని ఉపయోగించి, వినియోగదారు తమ ఎడమ చేతితో టైప్ చేయవచ్చు. మదర్ ఆఫ్ ఆల్ డెమోస్ దీన్ని అభివర్ణిస్తారు.

స్టీవ్ జాబ్స్ 1979లో ఒక పరిశోధనా కేం ద్రాన్ని సందర్శించినప్పుడు మౌస్, గ్రాఫికల్ యూజర్ ఇంటర్‌ఫేస్ ని చూశారు.దీన్ని ఆపరేట్ చేయడం ఎంత సులభమో గ్రహించి చాలా సంతోష పడ్డారు.దాంతో ఆపిల్ కంప్యూటర్లకు కూడా దీనిని అనుసరించాలని భావించారు. కానీ 245-పౌండ్ల జిరాక్స్ మౌస్ పని తీరు సరిగ్గాలేకపోవడంతో 12-పౌండ్లతో వన్‌ బటన్ మౌస్‌ రూపొందించాలని నిర్ణయించుకున్నారట.ఆర్‌ఆర్‌వేలంపై సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ బాబీ లివింగ్‌స్టన్ మాట్లాడుతూ ఎం గెల్‌బార్ట్
ఆవిష్కరణ కంప్యూటర్ చరిత్ర పరిణామంలో ఈ పరికరం కీలక పాత్ర పోషించింది.