Site icon HashtagU Telugu

WhatsApp: వాట్సాప్ లో ఇలాంటి పనులు చేస్తున్నారా.. అయితే నేరుగా జైలుకి వెళ్లాల్సిందే!

Whatsapp

Whatsapp

ప్రస్తుత రోజుల్లో వాట్సాప్ వినియోగం ఎలా ఉందో మనందరికీ తెలిసిందే. రోజురోజుకీ వాట్సాప్ వినియోగదారుల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. దీంతో వినియోగదారుల కోసం కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకు వస్తూనే ఉంది వాట్సాప్ సంస్థ. ఇక ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునే వరకు మనం వాట్సాప్ వినియోగిస్తూనే ఉంటాం. చాటింగ్ లో వీడియో కాల్స్ ఫోన్ కాల్స్ మాట్లాడుతూ ఉంటాము. మీకు తెలుసా వాట్సాప్ ను దుర్వినియోగం చేస్తే జైలుకు వెళ్లడం ఖాయం అంటున్నారు నిపుణులు. కొన్ని రకాల తప్పులు చేస్తే తప్పకుండా అది నేరం కిందికే వస్తుందట.

మరి వాట్సాప్ లో ఎలాంటి తప్పులు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వాట్సాప్‌ లో అశ్లీల, హింసాత్మక లేదా మతపరమైన అభ్యంతరకరమైన కంటెంట్‌ ను పంపడం భారతీయ చట్టం ప్రకారం నేరం. ఐటీ చట్టం 2000 లోని సెక్షన్ 67 ప్రకారం, అలా చేస్తే జైలు, జరిమానా విధించవచ్చట. అలాగే వాట్సాప్ గ్రూప్‌లలో వార్తలు పంపడం, వదంతులు వ్యాపింపజేయడం పెద్ద నేరం కిందకే వస్తుందని చెబుతున్నారు. ఇది సమాజంలో అశాంతిని వ్యాప్తి చేస్తుందట. ఐపీసీ సెక్షన్ 505 ప్రకారం పుకార్లు వ్యాప్తి చేసే వ్యక్తికి జైలు శిక్ష విధించవచ్చట. వాట్సాప్‌లో ఎవరికైనా బెదిరింపు లేదా బెదిరింపు సందేశాలు పంపడం చట్టరీత్యా నేరం. ఇది ఐపీసీ సెక్షన్ 503 ప్రకారం తీవ్రమైన నేరం.

దీనికి శిక్ష విధించే నిబంధన ఉందట. వాట్సాప్ లో జాతి, మత లేదా సామాజిక ద్వేషాన్ని వ్యాప్తి చేసే సందేశాలను పంపడం మానుకోవాలి. ఇలా చేయడం సమాజానికి ప్రమాదకరం, కఠినమైన శిక్షలకు దారి తీస్తుందట. పిల్లల లైంగిక వేధింపులకు సంబంధించిన ఏదైనా కంటెంట్‌ ని వాట్సాప్‌ లో షేర్ చేయడం చట్టవిరుద్ధం అని చెబుతున్నారు. అలా చేయడం పోక్సో చట్టం ప్రకారం తీవ్రమైన నేరం. ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్ వంటి ప్రభుత్వ పత్రాల నకిలీ కాపీలు తయారు చేయడం లేదా వాట్సాప్‌లో షేర్ చేయడం నేరం. ఇది నకిలీ కిందకు వస్తుందని చెబుతున్నారు.