Site icon HashtagU Telugu

Autonomous Robot : నేను పెట్టుబడి పెడతా..! మీరు సిద్ధమా..? అంటూ ఆనంద్ మహీంద్ర ట్వీట్

Autonomous Robot For Cleani

Autonomous Robot For Cleani

సోషల్ మీడియా (Social Media)లో నిత్యం యాక్టివ్ గా ఉండే ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్ మహీంద్ర (Anand Mahindra)..సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న సంఘటనల ఫై ఎప్పటికప్పుడు స్పందిస్తుంటారు. అలాగే సరికొత్త టక్నాలజీ యంత్రాలు కనిపించిన వాటిపై అరా తీయడం..అలాంటివి మనదేశం లో ఉంటె బాగుందనీ చెప్పడం..అలాంటివి రూపొందించే వారికీ భరోసా ఇవ్వడం వంటివి చేస్తుంటారు.

తాజాగా ఓ నదిలో చెత్తను తొలగిస్తున్న ఆటోమేటిక్ రోబోటిక్ యంత్రం (Autonomous Robot for Cleaning Rivers) గురించి మహీంద్రా ట్వీట్ చేసారు. గత రెండు రోజులుగా సోషల్ మీడియా లో ఓ వీడియో వైరల్ గా మారింది. ఓ నదిలో రోబోటిక్ యంత్రం తనకుతానుగా చెత్తను లాక్కొని తనలో వేసుకుంటుంది. తద్వారా నది పరిశుభ్రంగా మారుతుంది. ఈ వీడియో నెటిజన్లను అమితంగా ఆకరిస్తూ…వైరల్ గా మారింది. దీనిని చూసిన ఆనంద్ మహీంద్ర తన ట్విటర్ (ఎక్స్) ఖాతాలో షేర్ చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ వీడియోలో కనిపిస్తున్న ఆటోమాటిక్ రోబో యంత్రం నదిలో చెత్తను భలే క్లీన్ చేస్తుంది. ఇది చైనాలో తయారైనట్లుంది.. ఇలాంటి రాబోల అవసరం మన దేశానికి ఎంతగానో ఉందని ఆనంద్ మహీంద్ర అన్నారు. ఈ తరహా రాబోలను మనంకూడా ఇప్పటికప్పుడే తయారు చేసుకోవాలని నేను భావిస్తున్నాను.. ఇప్పటికే ఇలాంటి రాబోలను తయారు చేస్తున్న, తయారు చేసేందుకు కృషి చేస్తున్నస్టార్టప్ లకు నేను అండగా ఉంటా.. పెట్టుబడి పెడతా అంటూ ఆనంద్ మహీంద్రా హామీ ఇచ్చారు. పూర్తి వివరాలతో నన్ను సంప్రదిస్తే ఆవసరమైన పెట్టుబడి అందించేందుకు సిద్ధంగా ఉన్నానని ట్వీట్ చేసారు. మరి ఇలాంటి యంత్రాలను రూపొందించే వారు మన దగ్గర ఉన్నారేమో చూడాలి.

Read Also : Bharat Rice : రూ.29కే కిలో భారత్ రైస్.. వచ్చే వారం నుంచే సేల్స్