Auto Expo 2023: కీవే రెట్రో బైక్ ఎస్ఆర్ 250.. ధర, ఫీచర్స్ ఇవే?

రోజురోజుకి దేశవ్యాప్తంగా ద్విచక్ర వాహన వినియోగదారుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రతి ఇంట్లో కనీసం రెండు

  • Written By:
  • Publish Date - January 12, 2023 / 07:30 AM IST

రోజురోజుకి దేశవ్యాప్తంగా ద్విచక్ర వాహన వినియోగదారుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రతి ఇంట్లో కనీసం రెండు మూడు బైకులు ఉంటున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా ప్రతి ఏడాది కొన్ని లక్షల సంఖ్యలో ద్విచక్ర వాహనాలు అమ్ముడవుతున్నాయి. కాగా ప్రతి ఏడాది మార్కెట్లోకి ఎన్నో రకాల ద్విచక్ర వాహనాలు విడుదలవుతున్న విషయం తెలిసిందే. ద్విచక్ర వాహన తయారీ కంపెనీలు ఎప్పటికప్పుడు వినియోగదారుల అభిరుచుల మేరకు సరికొత్త అద్భుతమైన ఫీచర్లు హంగులతో ఎన్నో రకాల బైకులను మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోని తాజాగా హంగేరియన్ బ్రాండ్ కీవే ఆటో ఎక్స్‌పోలో కొత్త బైక్‌ను భారత మార్కెట్ లోకి లాంచ్‌ చేసింది. ఎస్ఆర్125 సిరీస్‌లో కీవే ఎస్‌ఆర్‌ 250ని ఢిల్లీలో జరుగుతున్న ఆటోఎక్స్‌పో 2023లో ఆవిష్కరించింది. కాగా తాజాగా ఆవిష్కరించిన ఈ రెట్రో మోడల్ బైక్ ఎస్‌ఆర్‌ 250 ప్రారంభ ధరను రూ. 1.49 లక్షలుగా నిర్ణయించింది. అయితే ద్విచక్ర వాహన వినియోగదారులకు ఒక అదిరిపోయే శుభవార్తను తెలిపింది. అదేమిటంటే కేవలం 2 వేల రూపాయలతో ఆన్‌లైన్‌ ద్వారా ఈ బైక్ ని బుక్‌ చేసుకోవచ్చని కంపెనీ వెల్లడించింది. సింగిల్ సిలిండర్, 4 స్ట్రోక్, 223సీసీ ఇంజన్‌, 7500 rpm వద్ద 15.8 bhp, 6500 rpm వద్ద16 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

 

కాగా 2023 ఏప్రిల్‌ నుండి ఈ ఎస్ఆర్250 బైక్ ల డెలివరీలు ప్రారంభం కానున్నాయి. ఇండియాలో ఎస్‌ఆర్‌ 125కి వచ్చిన ఆదరణ నేపథ్యంలో దీన్ని తీసుకొచ్చామని AARI మేనేజింగ్ డైరెక్టర్ వికాస్ ఝబఖ్ తెలిపారు. ఇది భారతదేశంలో హంగేరియన్ బ్రాండ్ 8వ ఉత్పత్తి. ఈ బ్రాండ్‌ను అదీశ్వర్ ఆటో రైడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా మార్కెట్‌ చేస్తోంది. ఈ మేరకు ఆ బైక్ కు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.