Site icon HashtagU Telugu

Bengalore: ఆటోని కారులా మార్చేసిన ఆటో డ్రైవర్.. వీడియో వైరల్?

Bengalore

Bengalore

టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో చదువు రాని వారు కూడా వినూత్నంగా ఆలోచిస్తూ ఒక్క కొత్త కొత్తవి కనుకుంటున్నారు. తెలివికి చదువుతో పనిలేదు అని ఇప్పటికే చాలామంది నిరూపించి చూపించారు. తాజాగా బెంగళూరులో ఒక వ్యక్తి ఏకంగా ఆటోని కారులా మార్చేశాడు. అంతేకాకుండా సీటింగ్ కారులో ఉండే సకల సౌకర్యాలను ఆటోలో కల్పించాడు. అయితే కారు కొనే స్తోమత లేకనో లేదంటే తన ఆటలో కూర్చున్న వారికి కారులో ప్రయాణించినట్టు ఫీలింగ్ కలగాలని అలా చేశాడు కానీ మొత్తానికి తన ఆటోని కారులా మార్చేశాడు ఆటో డ్రైవర్.

తనకున్న తెలివితేటలు పట్టుదలతో ఒక ఆటోని అలా కొత్తగా క్రియేట్ చేశాడు. వెనుక వైపు ఉన్న మూడు సీట్లు కూడా ఎంచక్కా మెత్తగా మనకు కారులో కూర్చున్న అనుభూతిని కలిగించే విధంగా డిజైన్ చేశాడు. చాలామందికి ఆటోలో కొద్దిగా ప్రయాణం చేయగానే అలసటగా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ ఆటోలో ఎంత దూరం ప్రయాణం చేసినా కూడా అలసట అనేది రాదు. అంతేకాకుండా ఆటో స్పీడ్ బ్రేకర్లు గతుకులలో వెళ్లినా కూడా ఏమాత్రం అలా అనిపించదు. అలా అనిపించకుండా ఉండడం కోసమే మెత్తని సీట్లను ఏర్పాటు చేశాడు సదరు ఆటో డ్రైవర్.

 

అయితే అందుకోసం డబ్బులు ఎక్కువైనా పర్వాలేదు అనుకుని తన కలలో నిజం చేసుకున్నాడు. కాగా అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో సదరు ఆటో డ్రైవర్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అతని కొత్త ఐడియా కి హ్యాట్సాఫ్ చెబుతున్నారు. కస్టమర్లు కూడా అతని ఎక్కడానికి ఆసక్తిని చూపిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ఆటో అనడం కంటే కారు అనడం మంచిదేమో.

Exit mobile version