Electric Cycle: మార్కెట్ లోకి మరో ఎలక్ట్రిక్ సైకిల్.. ధర, ఫీచర్స్ ఇవే?

ప్రస్తుతం దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు ఉన్న క్రేజ్ డిమాండ్ విపరీతంగా

  • Written By:
  • Publish Date - March 14, 2023 / 07:45 AM IST

ప్రస్తుతం దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు ఉన్న క్రేజ్ డిమాండ్ విపరీతంగా పెరిగిపోతోంది. దాంతో మార్కెట్లోకి ఎక్కువగా ఇంధనంతో నడిచే వాహనాల కంటే ఎలక్ట్రిక్ వాహనాలు ఎక్కువగా విడుదల అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎలక్ట్రానిక్ సంస్థలు ఒకదాన్ని మించి మరొకటి కొత్త కొత్త ఫీచర్స్ సరికొత్త లుక్ లో అద్భుతమైన ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. కేవలం ఎలక్ట్రిక్ బైక్స్, స్కూటర్స్, కార్స్ మాత్రమే కాకుండా ఎలక్ట్రిక్ సైకిల్స్ ని కూడా విడుదల చేస్తున్నాయి. కాగా తాజాగా మరో ఎలక్ట్రిక్ సైకిల్ మార్కెట్ లోకి విడుదల అయ్యింది. ఆ వివరాల్లోకి వెళితే.. ప్రముఖ వాహన తయారీ కంపెనీ ఆడి ఎలక్ట్రిక్ సైకిల్‌ను తీసుకువచ్చింది.

ఆర్ఎస్ క్యూ ఇట్రాన్ ఈ2 ఎలక్ట్రిక్ డాకర్ ర్యాలీ రేసర్ స్పూర్తితో ఆడి కొత్త ఎలక్ట్రిక్ సైకిల్‌ను తీసుకువచ్చింది. ఈ ఇటలీకి చెందిన ఫ్యాంటిక్ కంపెనీ ఈ ఎలక్ట్రిక్ సైకిల్ ను తయారు చేసింది. ఎక్స్ఎంఎఫ్ 1.7 ఆధారంగా దీనిని రూపొందించింది. కాగా ఇందులో 250 వాట్ బ్రోస్ మోటార్ ఉంటుంది. అలాగే హార్లీ డేవిడ్‌సన్ సీరియల్ 1 బాష్‌లో ఈ మోటార్‌ను గమనించొచ్చు. ఇందులో కంపెనీ 720 వాట్ బ్యాటరీని అమర్చింది. అయితే ఆడి కంపెనీ ఈ కొత్త ఎలక్ట్రిక్ సైకిల్ రేంజ్ ఎంత, దాని టాప్ స్పీడ్ ఎంత ఉంటుంది అన్నది ఇంకా వెల్లడించలేదు. కానీ దీని రేంజ్ 95 మైల్స్ కన్నా ఎక్కువగా ఉండొచ్చనే అంచనా. అదేవిధంగా ఈ ఆడి కొత్త ఎలక్ట్రిక్ సైకిల్‌లో 4 లెవెల్స్ ఎలక్ట్రిక్ అసిస్టెన్స్ ఉంటుంది. మైల్డ్ మోడ్ నుంచి ఆల్ ఔట్ బూస్ట్ మోడ్ వరకు ఇతర బ్రోస్ పవర్డ్ ఇబైక్స్ మాదిరిగానే ఇందులో కూడా ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ సైకిల్ ఫీచర్స్ విషయానికి వస్తే.. దీనిని అల్యూమినియంతో తయారు చేశారు.

అలాగే అధిక నాణ్యత కలిగిన విడి బాగాలను సైతం ఇందులో ఉపయోగించారు. బ్రేకింగ్ ఇన్.కా.ఎస్ డిస్క్ బ్రేక్స్, ఓహ్లిన్స్ ఫోర్క్ అండ్ షాక్, శ్రామ్ కాంపొనెంట్స్ ఫర్ చెయిన్, షిఫ్టర్స్ అండ్ డెరైల్యూర్ వంటివి ఉన్నాయి. ఇంకా ఇందులో ప్రీమియం ఇటాలియన్ టచెస్ ఉన్ని. విట్టోరియా టైర్స్, షెల్లా ఇటాలియ శ్యాడల్ వంటి వాటిని గమనించొచ్చు. ఆడి ఎలక్ట్రిక్ సైకిల్ మూడు వేరియంట్ల రూపంలో లభిస్తోంది. వీటి ధర యూకేలో 8499 నుంచి 10,200 డాలర్ల వరకు ఉంది. అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం ఈ ఆడి ఎలక్ట్రిక్ సైకిల్ ధర రూ 8 లక్సలకు పైమాటే అని చెప్పవచ్చు.