Site icon HashtagU Telugu

మడత పెట్టే ల్యాప్ టాప్..ధర ఎంతో తెలుసా?

Asus Folding Laptop

Asus Folding Laptop

మడత పెట్టే ఫోన్ లే కాదండోయ్, కొత్తగా మడత పెట్టే ల్యాప్ టాప్ లు కూడా వచ్చేసాయి. అయితే ఇప్పటివరకు మనం కేవలం మడత పెట్టే ఫోన్లో గురించి మాత్రమే విన్నాము అటువంటి ఫోన్ లను చూసాం. కానీ ఆసుస్ కంపెనీ ప్రపంచంలోనే తొలి ఫోల్డింగ్ ల్యాప్ టాప్ ను విడుదల చేసింది. ఆసుస్ జెన్ బుక్ 17 ఫోల్డ్ ఓఎల్ఈడీ పేరుతో ఈ ల్యాప్ టాప్ ను మార్కెట్ లోకి తీసుకువచ్చారు. అంతే కాకుండా ప్రపంచంలోనే మొట్టమొదటి ఫోల్డింగ్ ల్యాప్ టాప్ ఇదే. కాగా ఈ ల్యాప్ టాప్ ధర ఫీచర్ల విషయానికొస్తే..

ఈ ల్యాప్‌టాప్‌ లో 17.3 అంగుళాల థండర్‌బోల్ట్ 4కె డిస్‌ ప్లే ఇస్తున్నారు. ఈ ల్యాప్‌టాప్‌ ని మడత బెట్టినప్పుడు 12.5 అంగుళాల స్క్రీన్‌గా మారుతుంది. ఇక మిగిలిన స్క్రీన్‌ను వర్చువల్‌ కీ బోర్డుగా మనం వాడుకోవచ్చు. దీంతో పాటు అదనంగా బ్లూటూత్‌ కనెక్టివిటీ తో సాధారణ కీ బోర్డు ఇస్తున్నారు. 12వ జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ7 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇంటెల్‌ ఐరిస్‌ ఎక్స్‌ఈ గ్రాఫిక్‌ కార్డ్‌ ఇస్తున్నారు. అలాగే 5 ఎంపీ ఏఐ కెమెరా, డాల్బీ అట్‌మోస్‌ సపోర్ట్‌తో నాలుగు స్పీకర్స్, నాలుగు యూఎస్‌బీసీ పోర్ట్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. ల్యాప్‌టాప్‌తోపాటు 500 జీబీ ఎస్‌ఎస్‌డీ ఎక్స్‌టర్నల్‌ స్టోరేజ్‌ ఉచితంగా ఇస్తున్నారు.

ఇందులో ల్యాప్‌టాప్‌, డెస్క్‌టాప్‌, ట్యాబ్లెట్‌, రీడర్‌, ఎక్స్‌టెండెడ్‌ అని ఐదు స్క్రీన్‌ మోడ్స్‌ ఉన్నాయి. మల్టీ స్క్రీన్ ఫీచర్‌తో డిస్‌ప్లేని ఒకేసారి మూడు స్క్రీన్లుగా వాడుకోవచ్చు. కాగా ఈ ల్యాప్‌టాప్‌ ధర విషయానికి వస్తే..రూ. 3,29,000గా కంపెనీ నిర్ణయించింది. ప్రారంభ ఆఫర్‌ కింద రూ. 2,84,290కే అందిస్తోంది. అయితే ఈ ఆఫర్ నవంబరు 10 వరకు మాత్రమేనని ఆసుస్‌ తెలిపింది. అక్టోబరు14 నుంచి ముందస్తు ప్రారంభంకానున్నాయి. ముందుగా బుక్‌ చేసుకున్న వారికి రూ. 27,100 విలువైన ఉచిత వారెంటీని కంపెనీ అందిస్తోంది.