Space Telescope: గ్రహశకలం ఢీకొనడంతో భారీగా దెబ్బతిన్న జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్?

నాసా సంస్థా నిత్యం అంతరిక్షానికి సంబంధించిన ఏదో ఒక విషయాన్ని తెలుపుతూనే ఉంటుంది. అయితే ఇప్పటికీ ఎన్నో

  • Written By:
  • Publish Date - July 21, 2022 / 09:30 AM IST

నాసా సంస్థా నిత్యం అంతరిక్షానికి సంబంధించిన ఏదో ఒక విషయాన్ని తెలుపుతూనే ఉంటుంది. అయితే ఇప్పటికీ ఎన్నో విషయాలను షేర్ చేసుకున్న నాసా సంస్థ తాజాగా మరొక విషయాన్నీ కూడా తెలిపింది. ప్రపంచంలోనే అతి పెద్ద టెలిస్కోప్ అయిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ దెబ్బతిన్నట్లుగా తాజాగా నాసా ఒక నివేదికలో పేర్కొంది. కాగా తాజాగా దెబ్బతిన్న ఈ జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ను దాదాపుగా 1000 కోట్ల డాలర్లు అనగా మన ఇండియన్ కరెన్సీ ప్రకారం దాదాపుగా 75 వేల కోట్లతో దానిని రూపొందించారు.

అంత భారీ మొత్తంతో రూపొందించిన ఈ టెలిస్కోప్ ను గత ఏడాది డిసెంబర్ 25న అంతరిక్షంలోకి పంపించడం జరిగింది. కాగా ఈ టెలిస్కోప్ తాజాగా ఈ ఏడాది మే నెలలో మైక్రో మెటిరాయిడ్ అనే ఒక సూక్ష్మ ఉల్కం ని ఢీ కొట్టింది. అయితే వేడి సమస్యలు ఇంతకుముందు అంచనా వేసిన దానికంటే చాలా తీవ్రంగా ఉండటంతో ఈ జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ భారీగా దెబ్బతిన్నట్లు నాసా తాజాగా ఒక నివేదికలో తెలిపింది. ఇక మే 22న అంతరిక్ష టెలిస్కోప్‌ లోని ప్రాథమిక అద్దాన్ని ఆరు మైక్రోమీటోరైట్‌లు ఢీకొన్నాయి. అయితే ప్రారంభంలో నష్టం చాలా పెద్దదిగా ఉందని నాసా శాస్త్రవేత్తలు గుర్తించలేకపోయారు.

కానీ మొదట్లో అయితే ఊహించిన దానికంటే మరింత తీవ్రంగా ఉందని, జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ పూర్తిగా దెబ్బతిందని నాసా శాస్త్రవేత్తలు వెల్లడించారు. గెలాక్సీలు, అంత‌రిక్షాన్ని స్ట‌డీ చేసేందుకు జేమ్స్ వెబ్ టెలిస్కోప్‌ను ప్ర‌యోగించారు. భూమి నుంచి 10 ల‌క్ష‌ల మైళ్ల దూరంలో ఈ టెలిస్కోప్ ఉంది. టెలిస్కోప్ ద్వారా తీసిన మొదటి చిత్రాలు ఇటీవలే విడుదలయ్యాయి. ఈ చిత్రాలు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాయి. మేలో జరిగిన ఉల్క దాడుల కారణంగా పరికరం శాశ్వతంగా దెబ్బతింటుందని శాస్త్రవేత్తలు చెప్పారు. ప్రస్తుతం, అనిశ్చితి యొక్క అతిపెద్ద మూలం మైక్రోమీటోరాయిడ్ అని, దీని వల్ల ప్రాథమిక అద్దాన్ని నెమ్మదిగా క్షీణింపజేస్తాయని శాస్త్రవేత్తలు తమ నివేదికలో తెలిపారు.